కంది పప్పు ధర తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

కంది పప్పు ధర తగ్గుముఖం

Dec 13 2025 7:55 AM | Updated on Dec 13 2025 7:55 AM

కంది

కంది పప్పు ధర తగ్గుముఖం

జనవరి 3 నుంచి తెలుగు మహాసభలు

లెక్కపత్ర సాయి సమితి అధ్యక్షుడిగా

హనుమంతప్ప

సిలిండర్‌ పేలి ఏడుగురికి గాయాలు

హొసపేటె: సిలిండర్‌ పేలి ఏడుగురికి గాయాలైన సంఘటన కోప్పళ జిల్లా గంగావతి తాలుకాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు హెబ్బాలకు చెందిన రాజేష్‌ నివాసంలో సిలెండర్‌ లీక్‌ కావడంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి గోడలు విరిగి పడడంతో అక్కడే ఉన్న రాజేష్‌, దురుగప్ప, సురేష్‌, టముసేనమ్మ, శ్రీకాంత్‌లకు స్వల్పగాయాలయ్యాయి. సురేష్‌, దుర్గేష్‌లకు తీవ్ర గాయాలవడంతో బళ్లారి అస్పత్రికి తరలించారు.

జనన, మరణాల నమోదులో జాప్యం

హొసపేటె: జిల్లాలో జనన మరణాల నమోదులో జాప్యం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికారి కవితా ఎస్‌.మన్నికెరి అదేశించారు. జిల్లా అధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పంట కోతల సమయంలో కూలి పనులకు వెళ్లిన వారి వివరాలు సేకరించాలని సూచించారు. వర్షాకాలంలో 3446, వేసవి కాలంలో 906 పంట కోత ప్రయోగాలు చేశారని తెలిపారు. నాలుగు నెలల్లో 7870 మంది జననం, 3563 మరణాలు నమోదు కావడం జరిగిందన్నారు. జనన మరణ ప్రమాణ పత్రాలు 24 గంటల్లో అందేలా చూడాలన్నారు.

అనాథలకు మఠంలోనే ఆశ్రయం

రాయచూరు రూరల్‌: అనాథలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు మఠాలు ఆశ్రయం కల్పిస్తున్నాయని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. కలబుర్గి జిల్లా యడ్రామి తాలూకా కడకోళ మడివాళ్లేవరలో జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్య మాట్లాడుతూ చెడుమార్గం వైపు సమాజం పయనిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికీ హిందూ సనాతన సంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధరామ శివాచార్య, చంద్రశేఖర్‌, అభినవ మురుఘంద్ర, వీర మహంతశివాచార్య, రామలింగయ్య, సిద్ధలింగ, చెన్నమల్ల శంకర్‌లింగ స్వామిజీ, మడివాళయ్య, శివరాజ్‌ పాటిల్‌ పాల్గొన్నారు.

మహిళలకు స్వయం ఉపాధి

రాయచూరురూరల్‌: కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏజీఎం సూర్యమని సాహు కోరారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జీవన మిత్ర సమాజ సేవ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఏజీఎం జ్యోతి వెలిగించి మాట్లాడారు. మహిళలు అర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందాలన్నారు. బ్యాంకు నుంచి రుణం పొంది జీవనోపాధి మార్గం ఎంచుకోవాలన్నారు. సైబర్‌ వంచనకు గురికాకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చాన్సలర్‌ హనుమంతప్ప, నాబార్డు మేనేజర్‌ కళావతి, నటరాజ్‌, రాజ్‌కుమార్‌, సతీష్‌ కుమార్‌, క్రిష్ణప్ప, తిమ్మణ్ణ, సంతోష్‌, శంకరప్ప, మధుస్మిత, శ్రీరాంబాబు, జయప్రకాష్‌, అశోక్‌ పాల్గొన్నారు.

రాయచూరు రూరల్‌: కల్యాణ కర్ణాటక పరిధిలో కంది పప్పు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల కిందట క్వింటా కంది పప్పు ధర రూ.7 వేలు పలుకగా.. తాజాగా రూ.6500 నుంచి రూ.6000కు తగ్గిపోయింది. జిల్లాలో దాల్‌ మిల్లులు, మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు. అయితే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సర్కారు ప్రకటించడంతో రైతులు ఊపిరిపీల్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 3.20 లక్షల హెక్టార్లలో కంది పంట సాగుచేస్తారు. వర్షాధారిత పంట కంది దిగుబడులు జిల్లాలోనే లక్ష టన్నుల మేర ఉంటాయి. ఈ ఏడాది కలబుర్గి, సేడమ్‌, చిత్తాపూర్‌, గురుమిఠకల్‌లో అధికంగా కంది పంట సాగు చేశారు. నీటి వనరులున్న భూములలో ఎకరాకు 12 –15 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. తగిన సమయంలో వర్షాలకు కురిస్తే ఎకరాకు 25 క్వింటాళ్ల వరకూ దిగుబడులు వస్తాయి. కలబుర్గిలో మార్కెట్‌ గోదాములు, దాల్‌ మిల్లులు లేకపోవడంతో ఇక్కడ పండే కందులకు ప్రత్యేకత లేకుండా పోయింది. కందిపప్పు బ్రాండ్‌ పేరుతో దళారులు లాభం పొందుతున్నారు.

ఇతర జిల్లాల్లో ధరలు పతనం

కంది ధరలు పతమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాకు మద్దతు ధర రూ.8000 వుంది. ఉత్తర కర్నాటకలోని కలబుర్గి, రాయచూరు, బీదర్‌, కోప్పళ, బాగల్‌కోట, విజయపుర జిల్లాలో 3.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో కంది సాగు చేశారు. ప్రస్తుతం ఏపీఎంసీ మార్కెట్‌లో క్వింటా ధర ఇక్కడ రూ.7 వేలు ఉండగా, నేడు రూ.5 వేల నుంచి రూ.6500 వరకు పలుకుతోంది. కంది కోతలు తీసి రాశిగా పోస్తున్న సమయంలో ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రధాన మార్కెట్‌

కళ్యాణ కర్నాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, బీదర్‌, బళ్లారి జిల్లాలు వస్తాయి. కలబుర్గి, బీదర్‌ జిల్లాలకు అనుకుని ఉన్న రాయచూరు జిల్లా ఉండడం, మార్కెట్‌, దాల్‌ మిల్లులు ఉండడంతో కందిపప్పుకు ప్రధాన మార్కెట్‌గా రాయచూరు ఎదిగింది. అయితే కలబుర్గి, సేడమ్‌, చిత్తాపూర్‌, గురుమిఠకల్‌లో కందిపప్పు, దాల్‌ మిల్లులు లేవు. దీంతో కందులను పప్పుగా మార్చుకొని విక్రయించేలా రైతులు ఎదగాలని జిల్లా అధికార యంత్రాంగం సూచిస్తోంది. కలబుర్గి డివిజన్‌లో కందిపప్పును చేర్చే ప్రాధాన్యం వివరిస్తోంది. కందులకు పేటెంట్‌ హక్కు రావడంతో అధిక మొత్తంలో రైతులు కంది పంట సాగు చేస్తున్నారు. కలబుర్గిలోనూ దాల్‌ మిల్లులు, మార్కెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

వ్యవసాయ మార్కెట్‌

విక్రయించేందుకు సిద్ధంగా కందులు

పాలికె ప్రతిపక్ష నాయకుడిగా శ్రీనివాస్‌

సాక్షి బళ్లారి: బళ్లారి మహానగర పాలికె ప్రతిపక్ష నాయకుడిగా శ్రీనివాస్‌ మోత్కూర్‌ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇది వరకూ ఆ స్థానంలో పనిచేసిన ఇబ్రహీంబాబు తప్పుకోవడంతో ఆయన స్ధానంలో మోత్కూర్‌ను బీజేపీ కార్పొరేటర్లు ఎంపిక చేశారు. మహానగర పాలికే కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ నగరంలో సమస్యలను పరిష్కరించేందుకు అధికార పార్టీ నిర్లక్ష్యం వహిస్తే గట్టిగా పోరాటం చేస్తామన్నారు. నగరంలో నీటి సమస్య, రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ, వీధి కుక్కల బెడద, మౌలిక సదుపాయాల కల్పన విషయం అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నగర మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్‌రెడ్డి, తదితరులు మోత్కూర్‌ను అభినందించారు. అనంతరం మహానగర పాలికే లెక్క పత్ర సాయి సమితి అధ్యక్షుడిగా హనుమంతప్ప బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో కేఎస్‌ దివాకర్‌, మల్లన్నగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం

శ్రీనివాసపురం: తాలూకాలోని దళసనూరు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్‌ సుధీంధ్ర శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలన జరిపారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న బావిని ఓ వ్యక్తి మూసివేసి కబ్జా చేసినట్లు స్థానికులు తహసీల్దార్‌ దృష్టికి తెచ్చారు. స్థలాన్ని సర్వే చేసిన అనంతరం ఆక్రమణ తొలగిస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. పీడీఓ మంగళ, ఎఎస్‌ఐ మునిగుర్రప్ప పాల్గొన్నారు.

మద్దతు ధరతో కొంటామంటున్న సర్కారు

బ్రాండ్‌ పేరుతో కందిని విక్రయిస్తున్న దళారులు

మద్దతు ధరతో కోనుగోలు చేస్తామన్న హామీ ఏమైంది?

జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కంది దిగుబడులను కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషి, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మద్దతు ధరతో కంది కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 9.67 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. తాజాగా కంది పంట కోతలు ప్రారంభమైనా ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభిస్తే తమకు కొంత లాభం చేకూరుతుందని రైతులు భావిస్తున్నారు.

హోసూరు: గుంటూరులో జరిగే మూడో ప్రపంచ తెలుగు మహా సభలకు హోసూరు ప్రాంత భాషాభిమానులు తరలి రావాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సలహాదారు ఎంఎస్‌.రామస్వామిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌, ఆంధ్రమేవజయతే సంయుక్తంగా 2026, జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మహాసభలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. గుంటూరు బొమ్మిడాల నగర్‌లోని దివ్యశ్రీ నందమూరి తారకరామారావు వేదికపై జరిగే ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, సభా, పూర్ణకుంభ పురస్కారాల ప్రదానోత్సవం, ఆంధ్రశ్రీ ప్రతిభా పురస్కారాలు, సౌజన్య సేవా పురస్కారాలు, గ్రంథావిష్కరణ, ఆంధ్రమేవ జయతే సంచికావిష్కరణ జరుగనున్నాయని తెలిపారు. హోసూరు నుంచి ఇప్పటివరకూ 41 మంది పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. హోటళ్లలో బస చేసేందుకు 20 శాతం రాయితీ కల్పించామని, ఉచిత భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు హోసూరు తెలుగు భాషాభిమానులు, తెలుగు సంఘాల నాయకులు పేర్కొన్నారు.

కంది పప్పు ధర తగ్గుముఖం 1
1/8

కంది పప్పు ధర తగ్గుముఖం

కంది పప్పు ధర తగ్గుముఖం 2
2/8

కంది పప్పు ధర తగ్గుముఖం

కంది పప్పు ధర తగ్గుముఖం 3
3/8

కంది పప్పు ధర తగ్గుముఖం

కంది పప్పు ధర తగ్గుముఖం 4
4/8

కంది పప్పు ధర తగ్గుముఖం

కంది పప్పు ధర తగ్గుముఖం 5
5/8

కంది పప్పు ధర తగ్గుముఖం

కంది పప్పు ధర తగ్గుముఖం 6
6/8

కంది పప్పు ధర తగ్గుముఖం

కంది పప్పు ధర తగ్గుముఖం 7
7/8

కంది పప్పు ధర తగ్గుముఖం

కంది పప్పు ధర తగ్గుముఖం 8
8/8

కంది పప్పు ధర తగ్గుముఖం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement