వ్యాపారుల మధ్య సఖ్యత అవసరం
రాయచూరురూరల్: జిల్లాలో వ్యాపారులు, వర్తకుల మధ్య సఖ్యత ఉండాలని బెంగళూరు పిపో అధికారి దనీషా మీనూ అన్నారు. కేఎస్‌ఎంసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నగరంలోని పరిశ్రమల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో దనీషా మీనూ మాట్లాడారు. జిల్లాలో వివిధ రకాల వాణిజ్య పంటలు పండిస్తున్న నేపథ్యంలో రైతులకు అందించే ప్రభుత్వం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర సర్కారు జీఎస్టీ, ఇతర సుంకాలను తగ్గించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయచూరు జిల్లా వాణిజ్య ఉద్యమ సంఘం అధ్యక్షుడు కమల్‌కుమార్ జైన్, పురుషోత్తం, తిప్పణ్ణ, త్రివిక్రం జోషి, లక్ష్మిరెడ్డి, చిదానంద, సతీష్, గురురాజ్ కులకర్ణి, హేమన్న, మల్లికార్జున పాల్గొన్నారు.
నగర అధ్యక్షుడిగా షహీన రాజా
రాయచూరురూరల్: ఏఐఎం రాయచూరు నగర అధ్యక్షుడిగా షహీన రాజాను నియమించారు. నగరంలోని బెస్తవారిపేటలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం నూతన పదాధికారులను ఎంపిక చేశారు. కార్యదర్శిగా ఫరూక్, సభ్యులుగా ఖాజా వలి, అపతాబ్‌హుసేన్, తన్వీర్ అహ్మద్ ఖాన్, షేఖ్ ఉస్మాన్, హలీం, అల్తాఫ్ ఉస్మాన్, సోహెయిల్ చౌదరి, ఇర్ఫాన్‌ఖాన్, వసీంలను నియమించారు.
దాడి చేసిన వారిని
అరెస్టు చేయాలి
రాయచూరు రూరల్: పీడీఓ లింగప్పపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్రిష్ణ డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి శుక్రవారం అందోళన చేపట్టారు. క్రిష్ణ మాట్లాడుతూ దేవదుర్గ తాలుకా క్యాదిబర పంచాయితీ అధికారి లింగప్పపై అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ రాథోడ్ భార్య పంచాయతీ అధ్యక్షురాలు కావడంతో పీడీఓను నిందించడం తగదన్నారు. ఆమె భర్త రాజశేఖర్ రాథోడ్ తాను చెప్పిన వారికి ఉద్యోగాలివ్వాలని ఒత్తిడి చేయడమేగాక, పీడీఓపై దాడి చేయడం తగదని ఆరోపించారు. విధులకు ఆటంకం కలిగించిన రాథోడ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీ పుట్టమాదయ్యకు వారు వినతిపత్రం సమర్పించారు. శంకర గౌడ, ఇతరులు పాల్గొన్నారు.
బాలింతల మరణాల
నియంత్రణకు కృషి
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతల మరణాలను నియంత్రించడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్‌కుమార కాందూ సూచించారు. తల్లీ, బిడ్డల అస్పత్రిని శుక్రవారం పరిశీలించిన ఆయన వైద్యులతో మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎన్నో వసతులున్నాయని, ఉద్యోగులు, సిబ్బంది బాలింతలకు సరైన చికిత్స అందించాలని సూచించారు. బాలింతల మరణాల నియంత్రణలో భాగంగా రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలవాలన్నారు. అయన వెంట జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సురేంద్ర బాబు, నందిత, ప్రజ్వలకుమార్, చంద్రశేఖర్‌పవార్, తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారుల మధ్య సఖ్యత అవసరం
వ్యాపారుల మధ్య సఖ్యత అవసరం


