
నేత్రపర్వం తీర్థోద్భవం
యశవంతపుర: కొడగు జిల్లా భాగమండల సమీపంలోని తలకావేరిలో శుక్రవారం కావేరి తీర్థోద్భవమైంది. కావేరి అమ్మవారు రోహిణిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి అశీర్వాదం తీసుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడ్డారు. కొడగుకు చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించి గీతాలకు నృత్యాలు చేస్తూ అమ్మవారికి హారతినిచ్చి స్వాగతం పలికారు. కొడగు ప్రజల సంప్రదాయ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం 1.44 గంటలకు మకర లగ్నంలో కావేరి తీర్థరూపిణిం అమ్మవారు దర్శనం ఇచ్చారు. సూర్యుడు కన్యారాశి నుంచి తులా రాశికి మారుతున్న కారణంగా మకర లగ్నంలో కావేరి అమ్మ తీర్థరూపిణిగా ఉద్భవించారు. కావేరి ఉద్భవి స్థానం నుంచి నీరు ఉత్పత్తి కావటం ఇక్కడ విస్మయంగా మారింది. కొడగుతో పాటు వేల మంది భక్తులు భక్తితో జీవ నదికి పూజలు చేశారు. తలకావేరిలో ప్రతి ఏటా కావేరి తీర్థ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వటం పురాతన కాలం నుంచి ఆనవాయితీ. తమిళనాడు నుంచి భక్తులు వచ్చి ఇక్కడి తీర్థాన్ని తీసుకెళ్లారు. మైసూరు మహారాజు, ఎంపీ యదువీర్ కృష్ణరాజ దత్త ఒడెయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేత్రపర్వం తీర్థోద్భవం

నేత్రపర్వం తీర్థోద్భవం