
నీటి కుంటలో పడి చిన్నారులు మృతి
రాయచూరు రూరల్: వ్యవసాయ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలైన ఘటన విజయపురలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం విజయపుర తాలుకా మించినాళ తాండాకు చెందిన స్వప్న రాజు రాథోడ్ (10), శివం రాజు రాథోడ్ (8), కార్తిక్ విశ్వ రాథోడ్ (8) నీటి కుంట వద్దకు వెళ్లారు. ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తూ కుంటలో పడటంతో ముగ్గురూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రశాంత్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.