
తేలిపోయిన తెల్ల బంగారం
రాయచూరు పత్తి మార్కెట్
పత్తి బేళ్లతో మార్కెట్‌కు వచ్చిన వాహనాలు
రాయచూరు రూరల్: పత్తి రైతులకు కాలం కలసి రావడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలపాలవుతున్నారు. తెల్ల బంగారానికి మార్కెట్లో ధరలు లభించడం లేదు. గత ఏడాది క్వింటాల్ రూ.8,500 నుంచి రూ.9,000 వరకూ పత్తి ధరలు పలికాయి. అయితే నేడు క్వింటా రూ.6,800 నుంచి రూ.7,100 వరకూ ధరలు పరిమితం అయ్యాయి. నూతన పత్తి మర్కెట్‌లో ధరలు ప్రకటించిన మిల్లు యజమానులు క్వింటాకు రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలోని క్రిష్ణ, మక్తల్, నారాయణ పేట, మద్దూరు, ఊట్కూరు, గద్వాల దరూరు, నందిని, బలిగేర, అయిజ, మాదవరం, ఇతర ప్రాంతాల నుంచి అధికంగా పత్తి బేళ్లు రాయచూరు మార్కెట్‌కు వస్తున్నాయి. నిత్యం హైదరాబాద్–రాయచూరు రహదారిలో పత్తి లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలు, జీపులు, క్యాబ్‌లతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాలో కృష్ణా నది ఉన్నా నీరందడం లేదు. రైతులు భూముల్లో సాగు చేసిన పంటల దిగుడులు అంతంత మాత్రమే. జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. భారతీయ పత్తి మండలి అధికారులు ఎక్కడా పత్తి కోనుగోలు చేస్తున్నట్లు సమాచారం రైతులకు అందడం లేదు. రాజకీయ నేతలు బూటకపు ప్రకటనలతో ప్రచారం చేయడాన్ని రైతులు ఖండిస్తున్నారు.
మార్కెట్‌లో పడిపోయిన పత్తి ధరలు
క్వింటా రూ.6,800 నుంచి
రూ.7,100 వరకూ పలుకుతున్న వైనం
నష్టాలపాలవుతున్న అన్నదాతలు

తేలిపోయిన తెల్ల బంగారం