
తెగిపడిన చేతివేళ్లు
హుబ్లీ: హవేరి నగరంలో మంజునాథ్ అనే బాలుడు కొడవలితో జొన్న సొప్పదంటును చిన్న ముక్కలుగా కట్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఎడమ బొటన వేలు, పక్కన ఉన్న చూపుడు వేలు కొంత భాగం తెగిపడింది. వెంటనే తెగి పడిన వేళ్లను ప్లాస్టిక్ కవర్లో చుట్టుకుని తన తండ్రి, అన్నతో కలిసి కేఎంసీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వెళ్లాడు. అయితే తెగిపడిన వేళ్లను అమర్చడానికి కుదరదని సర్జన్ డాక్టర్లు స్పష్టం చేశారు. అలా అమరిస్తే ఇన్‌ఫెక్షన్ అవుతుందని తెలిపారు. బాలుడికి సర్జన్ డాక్టర్లు చికిత్స చేసి డిశార్జ్ చేశారు.