
భారీ శబ్దపు టపాసులు నిషేధం
బనశంకరి: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చి శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడి పరిసరాలకు హాని కలుగుతుంది. అంతేగాక ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తుంది. ప్రాణులు, పక్షులకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పరిసర స్నేహిగా, నిరాడంబరంగా, కాలుష్యరహితంగా, భక్తిపూర్వకంగా ఆచరించాలని ప్రభుత్వం మనవి చేసింది. టపాసుల విక్రయాలు, ప్రజలు హసిరు టపాసులు గుర్తించడానికి చర్యలు టపాసుల బాక్సులపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్‌ఎల్), నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లోగో, రిజిస్ట్రేషన్ నెంబరు ముద్రించాలి. అధికారికంగా టపాసుల విక్రయాలకు సంబంధించిన శాఖ ప్రాధికార నుంచి అందించిన లైసెన్సులో నిర్ణయించిన తేదీ, స్థలాల్లో మాత్రమే తాత్కాలికంగా టపాసుల దుకాణాలు తెరవాలి. నిషేధించిన టపాసులు కనబడితే అలాంటి టపాసులను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీపావళి పండుగను అపార్టుమెంట్ మైదానంలో పరిసర స్నేహిగా ఆచరించాలని అపార్టుమెంట్ వాసులకు సూచించింది. చెట్లు, ప్రాణులు, పక్షులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహించాలి. 125 డెసిబల్స్ శబ్దం కంటే అధిక ప్రమాణపు శబ్దం కలిగిన టపాసులను నిషేధించారు. విద్యాసంస్థలు, ఆసుపత్రి, వృద్ధాశ్రమాలు లాంటి సున్నిత ప్రదేశాల వద్ద టపాసులు కాల్చడం నిషేధం. టపాసులు కాల్చిన అనంతరం ఉత్పత్తి అయ్యే పొడిచెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయరాదు. స్థానిక సంస్థలు నిర్ణయించిన చెత్త తరలించే వాహనాల్లో అందించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హసిరు టపాసులు మినహా ఎలాంటి టపాసులను రాత్రి 8నుంచి 10 గంటల వరకు కాల్చాలి.
125 డెసిబల్స్ కంటే ఎక్కువ ప్రమాణంలో శబ్దం ఉండరాదు
దీపావళిని పరిసర స్నేహిగా ఆచరించాలని సర్కారు మనవి