
ఉద్యోగ ఖాళీల భర్తీకి డిమాండ్
● రాయచూరులో కదం తొక్కిన విద్యార్థులు, ఉద్యోగార్థులు
రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని ఒత్తిడి చేస్తూ ఉద్యోగార్థులల పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో రాష్ట్ర కార్యదర్శి చెన్న బసవ మాట్లాడారు. నిరుద్యోగులకు వయస్సు మీరుతున్న తరుణంలో రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పక్కన బెట్టడం తగదన్నారు. ఏడాదికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగులను నియమించుకొని ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని తప్పుబట్టారు.
కురుబలను ఎస్టీ
జాబితాలో చేర్చొద్దు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా జరుగుతున్న కుల గణన సర్వేలో కురుబలు ఎస్టీలుగా నమోదు చేసుకోవడం తగదని కల్యాణ కర్ణాటక అఖిలాండ శ్రీమహర్షి వాల్మీకి నాయక్ సమితి అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల నాయక్ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాలు లభించవన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇతర కులాల వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం తగదన్నారు. కొంత మంది కురుబలను కాడు కురుబ, గొండ అంటూ ఎస్టీలుగా నమోదు చేసుకున్న వారి పేర్లను తొలగించాలన్నారు.
నిరసన ర్యాలీ
బళ్లారి అర్బన్: సుప్రీం చీఫ్ జస్టిస్ జస్టిస్ బీఆర్ గవాయిపై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విసిరి అవమానించాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ కోరారు. స్థానిక డీసీ కార్యాలయం ఎదుట ప్రగతిపర దళితపర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన ర్యాలీలో నిర్వహించారు. గోవర్ధన్, బీకే.బసప్ప, కల్లుకంబ పంపాపతి, జగన్, కొళగల్ ఎర్రిస్వామి, సన్న నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
టమాటాల పారబోత
హొసపేటె: తాము పండించిన టమాటాలకు సరైన ధర లభించక పోవడంతో కలత చెందిన రైతులు కూడ్లిగి తాలూకాలోని డ్రెయిన్‌లో టమాటాలను పారబోశారు. ఆదివారం కూడ్లిగి తాలూకాలో సహా వివిధ ప్రాంతాల్లో టమాటాల ధరలు పడిపోవడం చూసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని ట్రాక్టర్లలో రోడ్డు పైకి తీసుకువచ్చి, డ్రెయిన్‌లో వేస్తున్నారు. తాలూకాలోని హుడెం సహా వివిధ గ్రామాల్లో పండించిన టమాటాలు సరైన ధర లభించకపోవడంతో ఎవరూ రూ.100 నుంచి రూ.200కి టమాటా బాక్స్ అడగడం లేదు. విజయనగర జిల్లాలో మొత్తం 2,248 హెక్టార్ల విస్తీర్ణంలో టమాటా పండిస్తున్నారు. కనీసం ఇప్పటికై నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రైతులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ ఖాళీల భర్తీకి డిమాండ్

ఉద్యోగ ఖాళీల భర్తీకి డిమాండ్