
హాసనాంబ దర్శనానికి భక్త దండు
బనశంకరి: హాసన్ నగరంలో కొలువైన హాసనాంబ దేవి ఆలయంలో అమ్మవారి దర్శనానికి నాలుగోరోజు భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సంతపేటే సర్కిల్ రోడ్డు పొడవునా భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం 8 గంటలకు భక్తులు రద్దీ తగ్గింది. రూ.1000 టికెట్ , రూ.300 టికెట్లు కొని ఎక్కువమంది దర్శనం చేసుకొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి పాస్, లడ్డూల విక్రయంతో రికార్డు స్థాయిలో రూ.2.24 కోట్లు వసూలైందని అధికారులు తెలిపారు.
రెవెన్యూశాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 3.50 లక్షల మంది భక్తులు హాసనాంబ ను దర్శించుకున్నారు. సంవత్సరంలో కొన్నిరోజులు మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు. మరోవైపు భక్తిగాన కచేరీ అలరించింది.
వేలాది మందితో క్యూలు

హాసనాంబ దర్శనానికి భక్త దండు