
వ్యసనముక్త సమాజాన్ని నిర్మిద్దాం
చెళ్లకెరె రూరల్ : వ్యసనముక్త సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని డీఎస్పీ సత్యనారాయణరావ్ తెలిపారు. నగరంలోని డి.సుధాకర్ క్రీడా మైదానంలో నిర్వహించిన సధృడ కర్ణాటక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. నేడు పిల్లలు చిన్న వయస్సులోనే దురలవాట్లకు బానిస అవుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి దురలవాట్లకు పిల్లలు బానిసలు కాకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యువకులు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లను అలవాటు చేసుకోరాదన్నారు. యువకులు ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్య, క్రీడలు, యోగా వంటి ఉత్తమ అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. చిన్న వయస్సులోనే ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు.