
మరుగుదొడ్ల నిర్మాణం తగదు
రాయచూరు రూరల్: నగరంలోని బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం తగదని అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ పేర్కొంది. సోమవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రమేష్ కులకర్ణి మాట్లాడారు. నగరసభ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ పథకం నుంచి నిర్మాణం చేపట్టిన పనులను విరమించుకోవాలన్నారు. బాపనయ్యదొడ్డి చుట్టు పక్కల చాలా ఆలయాలున్నాయని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాటి నిర్మాణ పనులను నిలిపి వేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఓట్ల చోరీపై విచారణ చేపట్టాలి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓట్ల చౌర్యంపై జుడీషియల్ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేిసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఏఐసీసీ కార్యదర్శి గోపీనాథ్ పళనియార్ మాట్లాడారు. బెంగళూరు లోక్‌సభ పరిధిలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అందులో 11 వేలు నకిలీ ఓట్లు, 40 వేల ఓట్లు అనుమానంతో కూడిన చిరునామాలు ఉన్నట్లు తేలడంతో 4 వేల ఓట్లు సస్పెండ్‌లో ఉంచారని, దానిపై జుడీషియల్ విచారణ చేపట్టాలని కోరుతూ ఆందోళన జరిపారు. ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, ఆర్టీఏ అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ శరణప్ప, పామయ్య, అమరేగౌడ, శ్రీనివాస్, శశికళ, వందన, జ్యోతి, శాంతప్ప, అస్లాం పాషా, రజాక్ ఉస్తాద్‌లున్నారు.
యథేచ్ఛగా సర్కారు భూముల కబ్జా
రాయచూరు రూరల్: రాయచూరు అటవీ శాఖలో విధులు నిర్వహించే అధికారులే అటవీ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి కుటుంబ సభ్యులకు కేటాయించారని సార్వజనిక హితరక్షణ పోరాట సమితి ఆరోపించింది. సోమవారం అటవీ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. సర్వే నంబర్–1257లో విచారణ జరిపి నిందితులపై చర్యలు చేపట్టాలన్నారు. అక్రమంగా నివాసం ఉన్న అధికారులను ఖాళీ చేయించాలని కోరుతూ అటవీ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
రోడ్డు నిర్మాణ నిధుల స్వాహా
రాయచూరు రూరల్: దేవదుర్గ తాలూకా మలదకల్‌లో రోడ్డు నిర్మాణానికి కేటాయించిన రూ.కోటి నిధులను అధికారులు, ఇంజినీర్లు స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలను నాసిరకమైన సిమెంట్‌తో చేశారన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిధులు దిగమింగారని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయడానికి వచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని, జెడ్పీ సీఈఓ ఈ విషయంలో విచారణ జరిపి నిధులు స్వాహా చేసిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.
సామాజిక బాధ్యత అవసరం
హుబ్లీ: విద్యార్థులు సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని రామదుర్గలోని కాయక సంజీవని ఫౌండేషన్ నాగమ్మ కులగోడ ప్యారా మెడికల్ కళాశాల, కాయక సంజీవిని నర్సింగ్ కళాశాల, బసవ ఫార్మసీ కళాశాల తొలి ఏడాది విద్యార్థులకు స్వాగత కార్యక్రమం, ఫైనలియర్ విద్యార్థులకు వీడ్కోలు వేడుక అప్యాయతల మధ్య నెరవేర్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక శాఖ మేనేజర్ హనుమంతరాయ బిరాదార్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర అభ్యాసంతో పాటు సామాజిక బాధ్యత రాయబారులుగా పర్యావరణ సంరక్షణ, స్వచ్ఛత, సేవ గురించిన ఆశక్తిని పెంపొందించుకుంటే సమాజం, దేశం ఆస్తులవుతారన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గల పౌరులుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ సుధీర్ వై.కులగోడ, పాలక మండలి డైరెక్టర్లు బీఎల్ దొడ్డమని, పీఎం కణవి, ప్రొఫెసర్ సిద్దణ్ణ పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణం తగదు

మరుగుదొడ్ల నిర్మాణం తగదు

మరుగుదొడ్ల నిర్మాణం తగదు