
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
రాయచూరు రూరల్: యరమరాస్ విమానాశ్రయం పనులపై రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శనివారం సాయంత్రం విమానాశ్రయం వద్ద జరుగుతున్న పనులను పరీశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రన్ వే, సీఆర్‌ఏఫ్, ఏటీసీ భవనాలు, మాస్టర్‌ప్లాన్‌ను కాల పరిమితిలోపు పూర్తి చేయాలన్నారు. యరమరాస్ వద్ద పేదలకు పంపిణీ చేయడానికి నిర్మించిన 2,419 ఇళ్లను పరిశీలించారు. 322 ఎకరాల ప్రాంతంలో నాలుగు కి.మీ దూరం రక్షణ గోడల నిర్మాణ పనుల వివరాలపై ఆరా తీశారు. పనులు నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు జుబీన్ మోహపాత్రో, ఏసీ గజానన, వెంకటేష్, భాళప్ప తదితరులు పాల్గొన్నారు.