
పెద్దల ఆత్మశాంతికి..
బనశంకరి: మహాలయ అమావాస్య సందర్భంగా ఆదివారం ఐటీ నగరిలోని బళేపేటే సర్కిల్‌లోని పురాతన కాశీ విశ్వనాథ దేవస్థానం రోడ్డులో నగర ప్రజలు మహాలయ అమావాస్య పూజలు, పిండ ప్రదానం చేశారు. నగరం నలుమూలల నుంచి తరలివచ్చారు. తమ తమ పెద్దల ఆత్మశాంతికి విశేష కర్మకాండలను జరిపించారు. ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
విచారణకు తిమరోడి గైర్హాజరు
యశవంతపుర: ఇంటిలో అక్రమంగా తుపాకీని ఉంచుకున్న ధర్మస్థల దుష్ప్రచారం కేసు నిందితుడు మహేశ్ శెట్టి తిమరోడి ఆదివారం బెళ్తంగడి పోలీసుల ముందు విచారణకు రాలేదు. దీనితో మళ్లీ పోలీసులు అతని ఇంటికి నోటీసును అంటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన మొదటి ముద్దాయి చిన్నయ్యను విచారించి, ఉజిరెలోని తిమరోడి ఇంటిలో సోదాలు చేయగా రెండు తుపాకులు లభించాయి. దీంతో అతనిపై ఆయుధాల కేసును నమోదు చేసి విచారణకు రావాలని ఆదేశించినా ముఖం చాటేశాడు.