
జై దుర్గా నమోస్తుతే
మాలూరు: మహాలయ అమావాస్య కావడంతో తాలూకాలోని లక్కూరు గ్రామంలోని చెరువు కట్టపై వెలసిన పురాతన శ్రీదుర్గాదేవి ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని మల్లెలతో సుందరంగా అలంకరించారు. అర్చకులు వేణుగోపాలస్వామి పూజలు జరిగాయి. పంచామృత అభిషేకం, వేదమంత్ర పారాయణం, మహామంగళారతి గావించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
కుల సర్వే అవసరం: మంత్రి
శివాజీనగర: కులగణనలో ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారు, బీజేపీ వివాదాలను సృష్టించే పని చేయరాదని విద్యా మంత్రి మధు బంగారప్ప అన్నారు. ఆదివారం బెంగళూరులో మాట్లాడిన ఆయన, కుల సమీక్ష చేయడం అవసరం, వివిధ సముదాయాల ఆర్థిక, సామాజిక పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఉపాధ్యాయులు తప్ప పర్యాయ వ్యవస్థ లేదు. దసరా సెలవులలోనే సర్వేను చేపట్టామని అన్నారు. బీజేపీ హయాంలో ఉపాధ్యాయులతో పనులు చేయించలేదా? అని అన్నారు. కులసమీక్ష అర్థవంతంగా, తప్పనిసరిగా కావాలి, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలన్నారు. దసరా సెలవును పొడిగించే యోచన లేదన్నారు.
అమ్మవారికి బలి పూజలు
మండ్య: మండ్య తాలూకాలోని సాతనూరు గ్రామంలో ఘనంగా మసణమ్మ దేవి జాతరను నిర్వహించారు. ఆదివారం అమావాస్య కావడంతో వేలాది మంది భక్తులు కోళ్లు, పొట్టేళ్లు, మేకలతో వచ్చి వాటిని అమ్మవారి ఆలయం ముందు బలి ఇచ్చి పూజలు చేశారు. తరువాత మాంసంతో విందు చేసుకున్నారు. బంధుమిత్రులకు, భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ ఆచారం తరతరాలుగా సాగుతోంది. గ్రామంలో మసణమ్మదేవి పాత గుడి, కొత్త గుడి ఆని రెండు ఆలయాలు ఉన్నాయి. కొత్త గుడిలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ అమ్మవారిని ఊరేగించారు. పాత గుడిలో ప్రాణుల బలి సాగింది.
దసరా ఛాయాచిత్ర ప్రదర్శన
మైసూరు: ఆదివారం మైసూరు నగరంలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళా మందిరంలో నాడ హబ్బ దసరా మహోత్సవాల సందర్భంగా దసరా ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి హెచ్‌సీ మహాదేవప్ప ప్రారంభించారు. ఎమ్మెల్యే తన్వీర్ సేట్, ఎమ్మెల్సీ కే.శివకుమార్, జిల్లాధికారి జి.లక్ష్మికాంత్‌రెడ్డి, పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ పాల్గొన్నారు.
చెట్టుకు కారు ఢీ, ఇద్దరు మృతి
గౌరిబిదనూరు: కారు డ్రైవరు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న దుర్ఘటనలో కారు నుజ్జు నుజ్జు కాగా, సుదర్ళన్ (45), మహమ్మద్ రజాక్ (29) అనే ఇద్దరు చనిపోయారు. రాజు (48), ఆదిల్ (22) అనేవారికి గాయాలయ్యాయి. వీరందరూ బెంగళూరు కెంపాపుర కాలనీకు చెందినవారు. శనివారం పనిమీద గౌరిబిదనూరుకు వచ్చి ఆదివారం సాయంకాలం తిరిగి బెంగుళూరుకు వెళుతూ ఉండగా, తిప్పగానహళ్ళి వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. నుజ్జు కాగా విడదీయడానికి జేసీబీని రప్పించారు. క్షతగాత్రులను బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. మంచేనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేశారు.

జై దుర్గా నమోస్తుతే

జై దుర్గా నమోస్తుతే

జై దుర్గా నమోస్తుతే