
కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలి
రాయచూరు రూరల్: కన్నడ భాషకు ప్రోత్సాహమివ్వాలని మైసూరు జిల్లా మాజీ జిల్లాధికారి సోమశేఖర్ కోరారు. ఆదివారం పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగ మందిరంలో బెళుకు ప్రతిష్టాన సాంస్కతిక వేదిక ఆధ్వర్యంలో సేవలకు జాతీయస్థాయి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటికి తెలుగు, కన్నడ కలిపి మాట్లడటం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాదాన్యత కల్పించాలన్నారు. ఇతర భాషలు కన్నడ భాషకు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. అన్య భాషలను కూడా గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ పుట్ట మాదయ్య, క్రిష్ణ, నరసింహులు వడవాటి, సురేంద్ర బాబు, చెన్న బసవ, విజయ్ జాగటగల్, బెళుకు సంస్థ అధ్యక్షుడు అణ్ణప్ప మేటి పాల్గొన్నారు.