తల్లి పాలు శిశువుకు అమృతంతో సమానం | - | Sakshi
Sakshi News home page

తల్లి పాలు శిశువుకు అమృతంతో సమానం

Aug 3 2025 8:10 PM | Updated on Aug 3 2025 8:10 PM

తల్లి

తల్లి పాలు శిశువుకు అమృతంతో సమానం

హొసపేటె: తల్లి పాలు బిడ్డ ఎదుగుదలకు అమృతం లాంటివని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్‌ ఎల్‌ఆర్‌ శంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. నగరంలోని మాతా శిశు ఆస్పత్రిలో జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. తల్లి, బిడ్డ మధ్య సంబంధం గర్భంలోనే ప్రారంభమవుతుంది. పాలు ఇచ్చే తల్లి దైవంతో సమానం. మన దేశంలో తల్లులకు దైవిక హోదా ఉంది. పిల్లల ఆరోగ్యానికి తల్లి పాలు చాలా ముఖ్యం. మరే ఇతర ఆహారం సరిపోదు. జిల్లాలోని 5 తాలూకా ఆస్పత్రుల్లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ, పిల్లల యూనిట్లు, పోషక పునరావాస కేంద్రాల్లో కమ్యూనిటీ స్థాయిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి జరుగుతోందని ఆయన అన్నారు.

ఆరు నెలల వరకు తల్లి పాలే శరణ్యం

జిల్లా ఆర్‌సీహెచ్‌ అధికారి డాక్టర్‌ జంబయ్య మాట్లాడుతూ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు శిశువుకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. తల్లి పాలలో శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదలకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయన్నారు. తల్లి పాల పూర్తి ప్రయోజనాలను పొందడానికి, న్యుమోనియా, విరేచనాలు, పోషకాహార లోపం, నవజాత శిశువుల మరణాలను నివారించడానికి శిశువు పూర్తి అభివృద్ధిలో తల్లిపాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. అంటువ్యాధులపై పోరాటంలో తల్లి పాలు ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటాయి. తల్లి నుంచి నేరుగా టీకాలు తీసుకోవడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని నిర్వహించాలన్నారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ భాస్కర్‌, ప్రభుత్వ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, మాతా శిశు ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ నూర్‌బాషా, పిల్లల వైద్యురాలు డాక్టర్‌ ఉషా, ఇతర వైద్యాధికారులు, బాలింతలు పాల్గొన్నారు.

తల్లి పాలే బిడ్డకు శ్రేష్టం

రాయచూరు రూరల్‌: పిల్లలు అపౌష్టికత నుంచి పౌష్టికతను పొందాలంటే తల్లి పాలే బిడ్డకు శ్రేష్టమని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ సురేంద్రబాబు పేర్కొన్నారు. నగరంలోని తల్లీబిడ్డల ఆస్పత్రి కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ స్తనపాన సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తల్లి గర్భిణిగా ఉన్న సమయంలో పౌష్టికాహారాన్ని సేవించాలన్నారు. ప్రసవానంతరం ఆరు నెలల పాటు బిడ్డకు తల్లిపాలు అందించాలన్నారు. పిల్లల పెరుగుదలకు తల్లి పాలు ఎంతో మేలన్నారు. కార్యక్రమంలో తాలూకా వైద్యాధికారి ప్రజ్వల్‌, భువనేశ్వరి, బసమ్మ, పర్వేజ్‌, సరోజలున్నారు.

తల్లి పాలు శిశువుకు అమృతంతో సమానం1
1/1

తల్లి పాలు శిశువుకు అమృతంతో సమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement