రూ.40 కోట్లతో రాయచూరు నగరాభివృద్ధి
రాయచూరు రూరల్: నగరంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామని నగరాబివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు రాజశేఖర్‌రామస్వామి తెలిపారు. ఆదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యానవనాలు, చెరువుల సుందరీకరణ, మహనీయు విగ్రహాల ఏర్పాటు తదితర పనులు చేపడుతామన్నారు. అర్‌డీఏ పరిధి విస్తరిస్తారిస్తామన్నారు. అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ సర్కిల్, బుద్ద విహర్ అబివృద్ధికి తలా రూ.50 లక్షలు కే టాయించామన్నారు. బసవేశ్వర సర్కిల్, తీన కందిల్, నూతన కలెక్టరేట్ వద్ద ఉద్యానవనం కోసం రూ.25 లక్షలు, ఆర్డీఓ సర్కిల్, బసవన బావి సర్కిల్‌కు రూ.20 లక్షలు, ఈద్గా మైదానం, యరమరాస్, డాలర్స్ కాలనీలో హైమాస్ వి ద్యుత్ దీపాల ఏర్పాటుకు రూ.40 లక్షలు కేటాయించామన్నారు. గంజ్ నుంచి నవోదయ అస్పత్రి వరకు డివైడర్‌లకు రూ. 2.4 కోట్లు, పబ్లిక్ గార్డెన్ అభివృద్ధికి రూ.2 కోట్లు, గద్వాల అంబేడ్కర్ సముదాయ భవనం, మహవీర్ సర్కిల్, జాకీర్ హుసేన్ సర్కిల్, వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి తలా రూ.25 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. నగరంలో 12 ఉద్యాన వనాలకు రూ.25 లక్షలు, రాంపూర్ తాగునీటి చెరువు, మన్సలా పూర్ చెరువు, గోల్లకుంట చెరువు, జలాల నగర చెరువుల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాయచూరు నగర ప్రాధికార పరిదిలోకి నూతనంగా 15 గ్రామాలను చేర్చుకోవడానికిక ప్రతి పాదనలను సిద్ధం చేశామన్నారు.


