జొన్నల కొనుగోలు కోసం రైతుల ధర్నా
రాయచూరు రూరల్: రైతులు ఖరీఫ్‌లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మాన్విలోని బసవ సర్కిల్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో సుమారు వంద ట్రాక్టర్లతో రాస్తారోకో చేపట్టారు. రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలి పాటిల్ మాట్లాడుతూ అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిరాకరించడాన్ని తప్పుబట్టారు. రైతులు తెచ్చిన జొన్నలను కొనుగోలు చేయాలని కేంద్రం వద్ద విన్నవించుకున్నా అధికారులు బేఖాతరు చేశారంటూ రాస్తారోకో జరిపారు. తాలూకాలో 1510 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. గత 10 రోజుల నుంచి కేంద్రాల వద్ద అధికారులు లేకపోవడంతో వాటిని బంద్ చేయడాన్ని ఖండించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదన్నారు.
జొన్నల కొనుగోలు కోసం రైతుల ధర్నా


