మైసూరు : కండక్టర్ చిల్లర ఇవ్వలేదని యువకులు దాడికి పాల్పడ్డారు. ఈఘటన మైసూరులో జరిగింది. వివరాలు...గుండ్లుపేటె కేఎస్ ఆర్టీసీ డిపో నుంచి మైసూరులోని గన్ హౌస్‌కు వెళ్తున్న బస్సులో ఎక్కిన ఇద్దరు యువకులు టికెట్ తీసుకున్నారు. ఆ సమయంలో చిల్లర సమస్య ఏర్పడింది. ఒకరికి డబ్బు ఇచ్చి ఇద్దరూ పంచుకోవాలని కండక్టర్ మల్లికార్జున వారికి సూచించాడు. అయితే నేరుగా చిల్లర డబ్బు ఇవ్వకుండా మమ్ములనే చిల్లర పంచుకోవాలని చెబుతావా అంటూ యువకులు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో దాడి చేశారు. దాంతో కండక్టర్ నజరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.