
మాన్విలో ఆందోళన చేస్తున్న కార్యకర్తలు
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా మద్లాపూర్‌లో ప్రసాద్ అనే దళిత నేతను హత్య చేసిన నిందితులను శిక్షించాలని దళిత ప్రగతిశీల సమాఖ్య డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి సంఘం అధ్యక్షుడు రవీంద్రనాథ్ పట్టి మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయన్నారు. మద్లాపూర్ ఘటనలో బాధిత కుటుంబానికి రక్షణ, పరిహారం కల్పించాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. అదే విధంగా మాన్విలో ప్రభురాజ్ కొడ్లి, రాజేంద్ర జాలదార్‌ల నేతృత్వంలో ర్యాలీ, ఆందోళన చేపట్టారు.

రాయచూరులో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం