మైసూరు: మహిష దసరా ఆచరణను మైసూరులో ప్రభుత్వం నిర్వహించడం లేదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మైసూరు మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో సీఎం మాట్లాడుతూ... మహిష దసరాను తాము గతంలో నిర్వహించలేదని, ఇప్పుడు కూడా చేయడం లేదన్నారు. చాముండిబెట్టలో నిర్వహించే మహిష దసరాపై జిల్లా పాలన యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ప్రతాప్‌ను అరెస్టు చేయాలి..
మైసూరులో మహిష దసరా ఆచరణ ముగిసే వరకు ఎంపీ ప్రతాప్ సింహను అరెస్టు చేయాలని మహిష దసరా ఆచరణ కమిటీ ముఖ్యులు, పాలికె మాజీ మేయర్ పురుషోత్తమ్ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ మహిష దసరా ఆచరణ కమిటీ ఆధ్వర్యంలో 13న ఆ వేడుకను నిర్వహించి తీరుతామన్నారు. ఘర్షణలు జరగకుండా ఆయన్ను అరెస్టు చేయాలన్నారు.


