ధర్నాలో పాల్గొన్న రైతులు, మహిళలు
మండ్య: నీటి విడుదల కొనసాగింపు ఆదేశాలపై మండ్య నగరంలో జయ చామరాజేంద్ర ఒడెయార్ సర్కిల్ వద్ద కర్ణాటక రాష్ట్ర పార్టీ సమితి కార్యకర్తలు మానవహారం నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. ఆపై బెంగళూరు –మైసూరు జాతీయ రహదారిలో వెళ్లి సర్‌ఎం విశ్వేశ్వరయ్య విగ్రహం వద్దకు చేరి ధర్నా చేశారు. వాహనాలు నిలిచిపోయాయి. మాకు తాగడానికి నీరు లేదు, పంటలకు నీరు లేదు, అయినా తమిళనాడుకు ఎలా వదలాలని నగరసభ మాజీ అధ్యక్షురాలు అంబుజమ్మ విలపించింది. ఢిల్లీలో ఉన్నవారికి మా బాధలు కనిపించడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.
23న మండ్య బంద్
మండ్య జిల్లా రైతు హితరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన మండ్య బంద్‌కు నిర్వహిస్తామని తెలిపారు. సర్ ఎంవి విగ్రహం వద్ద ధర్నాలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. 23న జిల్లా బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు.
ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులు


