అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

కరీంనగర్‌టౌన్‌: గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లు, కార్యదర్శులు పని చే యాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అశ్వి ని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పంచాయతీల సమగ్ర అభివృద్ధిపై సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపైనే ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమి షనర్‌ కె.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టొచ్చన్నారు. జిల్లా పంచాయతీ అధి కారి జగదీశ్వర్‌ మాట్లాడుతూ.. సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పని చేయా లన్నారు. జెడ్పీ సీఈవో పవన్‌కుమార్‌, డీఆర్‌డీవో గీత, పీఆర్‌ డీఈ జనార్దన్‌ పాల్గొన్నారు.

చామనపల్లిలో శిక్షణ కలెక్టర్‌ పర్యటన

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం చామనపల్లిలో గురువారం శిక్షణ కలెక్టర్‌ హరిప్రసాద్‌ పర్యటించారు. కంపోస్టుషెడ్‌, నర్సరీ, వైకుంఠధామం, రింగ్‌కంపోస్టులను పరిశీలించారు. తడి, పొడి చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ తీరును పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రావును అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. సర్పంచ్‌ బోగొండ ఐలయ్య, ఉపసర్పంచ్‌ దూడం శ్రీనివాస్‌, జీపీవో వీరేశం, ఫీల్డ్‌అసిస్టెంట్‌ అంజనేయులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో ‘అన్న, అక్క మెంటర్షిప్‌’

కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రా రంభించిన అన్న, అక్క మెంటర్షిప్‌లో భాగంగా గురువారం ఎస్సారార్‌ కళాశాల బీకాం, బీబీఏ ఐదో సెమిస్టర్‌, బీకాం థర్డ్‌ సెమిస్టర్‌ విద్యార్థులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ, డిజిటల్‌ లర్నింగ్‌ శిక్షణపై తరగతులు ప్రా రంభించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, మెంటర్షిప్‌ జిల్లా నోడల్‌ అధికారులు మధు, రాజేష్‌, మల్లారెడ్డి, ఆంజనేయులు, గుర్రం రాజేందర్‌, ఉన్నత విద్య జేఏసీ చైర్మన్‌ కడారు సురేందర్‌ రెడ్డి, హెచ్‌ఎంలు, శ్రీనివాస్‌ రెడ్డి, హర్‌ జ్యోతి కౌర్‌, సమన్వయకర్తలు పాల్గొన్నారు.

నకిలీ ఎరువులు పట్టివేత

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం మొ గ్ధుంపూర్‌లో బుధవారం వ్యవసాయాధికారులు నకిలీ ఎరువులను పట్టుకున్నారు. గ్రామంలో ఇద్దరు రైతుల వద్ద నకిలీ ఎరువులున్నాయనే సమాచారంతో ఏవో సత్యం తనిఖీలు చేపట్టారు. ఒక్క రైతు వద్ద 9 బస్తాలు, మరో రైతు వద్ద 12 బస్తాల కోరమండల్‌ పేరిట 28–28–0 కాంప్లెక్స్‌ ఎరువులు లభించాయి. వీటిని కోరమండల్‌ కంపెనీ ప్రతినిధులు వచ్చి పరిశీలించి తమ ఉత్పత్తి కాదని నిర్ధారించారు. ఓ వ్యక్తి త మకు విక్రయించాడని రైతులు తెలిపారు. ఏవో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

దరఖాస్తులు ఆహ్వానం

చొప్పదండి: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు ప్రిన్సిపాల్‌ కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్‌ 28న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తులను జూలై 31లోగా నవోదయ వెబ్‌సైట్‌ ద్వారా పంపించాలని కోరారు. ఐదోతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. మల్యాల, జగిత్యాల, మెట్‌పల్లిలో చదువుతున్న ఐదోతరగతి విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు నవోదయ విద్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement