ఏబీవీపీ ఆవిర్భావ సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ఏబీవీపీ ఆవిర్భావ సంబరాలు

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

కరీంనగర్‌టౌన్‌: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ ఎదిగి దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులను చైతన్యవంతం చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ అన్నారు. కరీంనగర్‌ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినో త్సవం, 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థాని క కోర్ట్‌ చౌరస్తా నుంచి గీతా భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించి సంఘం జెండా ఆవిష్కరించారు. రావుల కృష్ణ మాట్లాడుతూ.. 78 ఏళ్లుగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్య కోసం ఉద్యమాలు, సామాజిక సేవ, నాయకత్వ వికా సం వంటి రంగాల్లో ఏబీవీపీ విశేష సేవలు అందిస్తోందన్నారు. జిల్లా కన్వీనర్‌ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేశ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, కన్వీనర్‌ నిత్య, జోనల్‌ ఇన్‌చార్జిలు ఆకాష్‌, ప్రశాంత్‌, కార్యకర్తలు శివ, నవీన్‌, య శ్వంత్‌, కావ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement