కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ పోల్‌సెంటర్‌లోని 33/11 కే.వీ వాటర్ వర్క్స్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన 1.4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను శనివారం ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్టులు) వి.మోహన్‌రావు ప్రారంభించారు. 350 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే మొత్తం 1.4 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రారంభించిన వెంటనే విద్యుత్ గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానించినట్లు వివరించారు. సబ్‌స్టేషన్ల వద్ద ఇలాంటి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక విద్యుత్ లోడ్ తగ్గుతుందని, ట్రాన్స్‌మిషన్ నష్టాలను నియంత్రించవచ్చన్నారు. సీజీఎం ప్రాజెక్ట్స్ సురేందర్, కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్ పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్య సేవలందించాలి
కరీంనగర్: నగర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ ఆదేశించారు. శనివారం మెతాజ్‌ఖానా ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు వడదెబ్బ గురించి వివరించాలన్నారు. గర్భిణులకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. అభా కార్డుల క్రియేషన్ సంఖ్యను పెంచాలన్నారు. డాక్టర్లు సన జవేరియా, ఇమ్రాన్‌ఖాన్ పాల్గొన్నారు.
‘రాజకీయ ఊసరవెల్లి సునీల్‌రావు’
కరీంనగర్ టౌన్: రాజకీయ స్వార్థం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరడం అలవాటుగా మార్చుకున్న రాజకీయ ఉసరవెల్లి మాజీ మేయర్ సునీల్ రావు అని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ విమర్శించారు. శనివారం కరీంనగర్‌లోని 47వ డివిజన్ కార్యాలయంలో మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కృషి ఫలితమేనని మేయర్‌గా ఉన్నప్పుడు పదేపదే ప్రకటించిన సునీల్‌రావు ఇప్పుడు భిన్నంగా మాట్లాడడం సిగ్గుచేటన్నా రు. కరీంనగర్ అభివృద్ధికి రూ.వేలకోట్లు తెచ్చామని చెబుతున్న నాయకులు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నాయకులు సత్తినేని శ్రీనివాస్, నారదాసు వసంతరావు, మోసిన్, రవి, వెంకటరెడ్డి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో అధికారులకు బాధ్యతల విభజన చేపట్టారు. అదనపు కమిషనర్–1 సువార్తకు శానిటేషన్, బర్త్ అండ్ డెత్, ట్రేడ్‌లైసెన్స్, ఎంసీకే ప్రజావా ణి, మెప్మా అప్పగించారు. అదనపు కమిషనర్–2 ఆయాజ్‌కు ఎస్టాబ్లిష్‌మెంట్, రెవెన్యూ, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్‌లు, రికార్డుగది, సిటిజన్ సర్వీస్ సెంటర్, కౌన్సిల్, కోర్టు వ్యవహారాలు కేటాయించారు. డిప్యూటీ కమిషనర్–1 ఖాదర్ మొహియొద్దీన్‌కు 8 నుంచి 15, 30 నుంచి 47, 53 నుంచి 59,65,66 డివిజన్ల రెవెన్యూ సెక్షన్, ప్రజాదర్బార్, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్స్, కోర్టు వ్యవహారాలు, డిప్యూటీ కమిషనర్– 2 వేణు మాధవ్‌కు 1 నుంచి 7,16 నుంచి 29,33, 34, 48 నుంచి 52,60 నుంచి 64 డివిజన్‌ల రెవెన్యూసెక్షన్, పెన్షన్స్, ఆర్‌టీఐ, ప్రొటోకాల్, కలెక్టరేట్ ప్రజావాణి, కోర్టు వ్యవహారాలు అ ప్పగించారు. సహాయ కమిషనర్ రాజమనోహర్‌కు శానిటేషన్, ఏబీసీ సెంటర్, డంప్‌యార్డ్, డీఆర్‌సీసీ, ప్రజాపాలన అప్పగించారు. ఆర్‌వోలు నియాజ్, భూమానందంలకు డివిజన్‌లు అప్పగిస్తూ, ఆర్‌ఐలను కేటాయించారు.
ఆర్డీవో బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ ఆర్డీవోగా షర్మిల శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చిత్రామిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు.


