వైభవంగా లక్ష దీపోత్సవం
విద్యానగర్(కరీంనగర్): కార్తీక మాసం సందర్భంగా కరీంనగర్ నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. అమ్మవారికి కార్తీక మాస ప్రయోక్త చతుషష్టి పూజలు, దీపాసంకల్పం, దీపారాధన, మహామంగళ హారతి. దీపా విశిష్టత ప్రవచనాలు జరిగాయి. తులసీ కల్యాణం నిర్వహించారు. దీపాసంకల్పన అనంతరం ఏకకాలంలో దీపోత్సవం నిర్వహించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులు, ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, వంగల పవన్, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా లక్ష దీపోత్సవం


