తనిఖీ బృందాలొస్తున్నాయ్‌ | - | Sakshi
Sakshi News home page

తనిఖీ బృందాలొస్తున్నాయ్‌

Nov 17 2025 8:40 AM | Updated on Nov 17 2025 8:40 AM

తనిఖీ బృందాలొస్తున్నాయ్‌

తనిఖీ బృందాలొస్తున్నాయ్‌

జిల్లాలో టీచర్లతో ఐదు బృందాల ఏర్పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తనిఖీలు 15 మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌

కరీంనగర్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. పాఠశాలల తనిఖీలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలను ఎంఈవోలు, డీఈవో, ఆర్జేడీ, సెక్టోరియల్‌ ఆఫీసర్లు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు తనిఖీ చేసేవారు. ఈ విద్యాసంవత్సరంలో వీరితో పాటు ప్రత్యేకంగా టీచర్లతో కూడిన తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు బృందాలు సోమవారం లేదా బుధవారం నుంచి పాఠశాలలను తనిఖీ చేసి, పలు అంశాలు పరిశీలించనున్నారు. వీరు తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి రిలీవ్‌ అయ్యి డిప్యుటేషన్‌పై డీఈవో పరిధిలో విధులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సంస్కరణలతో పాటు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ నాణ్యమైన విద్యా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి తనిఖీ బృందాల ద్వారా ఉపాధ్యాయుల డుమ్మా, మౌలిక వసతులు, విద్యార్థులకు అందజేస్తున్న ఉచిత దుస్తులు, పుస్తకాలు, పాఠశాలకు వస్తున్న నిధులపై తనిఖీ బృందాలు పరిశీలన చేయనున్నాయి.

జిల్లాలో ఐదు బృందాలు

జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 429, ప్రాథమికోన్నత 76, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలు 149, కేజీబీవీ 12, మోడల్‌ స్కూల్‌ 11 ఉన్నాయి. వీటిని ఐదు బృందాలు తనిఖీ చేయనున్నాయి. ఒక్కో బృందానికి ఒకరు నోడల్‌ ఆఫీసర్‌గా, ఇద్దరు ఎస్జీటీలు సభ్యులుగా ఉండనున్నారు. మొదటి బృందంలో జి.చెన్నారెడ్డి(ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం) నోడల్‌ ఆఫీసర్‌గా, గంట సుజాత, టి.మాధవస్వామి సభ్యులుగా, రెండో కమిటీలో వి.ప్రశాంత్‌కుమార్‌ (ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం) నోడల్‌ ఆఫీసర్‌గా టి.తిరుపతి, జి.మహేందర్‌ సభ్యులుగా, మూడో కమిటీలో నోడల్‌ ఆఫీసర్‌గా దాసరి శ్రీధర్‌ (ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం) సభ్యులుగా బొల్లి కిరణ్‌, వై.కోండల్‌ రెడ్డి సభ్యులుగా ఉంటారు. నాలుగో కమిటీలో నోడల్‌ ఆఫీసర్‌గా కెతిరి జీవన్‌, సభ్యులుగా బాలాజీ, ఏ.సునీత ఉన్నారు. యూపీఎస్‌ తనిఖీ బృందంలో నోడల్‌ ఆఫీసర్‌గా మల్లయ్య (ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం), సభ్యులుగా కె.శ్రీలతరావు, ఎస్‌.ఐలయ్య ఉన్నారు. పాఠశాల తనిఖీకి నియామకమైన 15మందిని డీఈవో పరిధిలోకి తీసుకోనున్నారు. ఈ విద్యాసంవత్సరమంతా వీరు తనిఖీ సభ్యులుగానే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరిస్థానంలో ఇతరులను సర్దుబాటు చేయనున్నారు.

తనిఖీ బృందాల విధులు ఇవే

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడం. రీఇన్‌స్పెక్షన్లు చేయడం, తనిఖీ వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయడం, విద్యాబోధన, నాణ్యత, విద్యార్థుల హాజరు, సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేలా కృషి చేయడం వీరి ముఖ్య ఉద్దేశం. వీరికి కావాల్సిన ఆర్థిక పరమైన ఖర్చులు సమగ్రశిక్ష నుంచి వెచ్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement