నిషేధిత భూములౖపై నజర్
కరీంనగర్ అర్బన్: నిషేధిత భూముల(22ఏ) జాబితా పక్కాగా రూపొందించేందుకు శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 90శాతం ప్రక్రి య పూర్తవగా త్వరలోనే జాబితా సిద్ధం కానుంది. ఒకట్రెండు రోజుల్లోనే సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోనూ అందుబాటులోకి రానుందని రెవెన్యూ అధి కారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 205 రెవెన్యూ గ్రామాలకుగానూ 184 గ్రామాల నిషేధిత భూముల జాబితాను సిద్ధం చేయగా 179గ్రామాల జాబితా అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి చేశారు. తొలుత సాంకేతికపరమైన ఇబ్బందులు, తదుపరి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నమూనా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఎ) కార్యాలయం ఇచ్చి న నమూనాలో తేడాలుండటంతో అప్‌లోడ్ ఆలస్యమైంది. రెండు రోజుల వ్యవధిలో వందశాతం జాబితాను అప్లోడ్ చేయాలని సీసీఎల్ కార్యదర్శి ఇటీవల ఆదేశించారు.
22ఏ ఇక సక్రమమేనా?
నిషేధిత భూముల జాబితా రాజకీయ కక్ష సాధింపునకు ఒక ఆయుధంగా మారిందనే ఆరోపణలున్నా యి. వారసత్వంగా వచ్చిన భూమిని రాజకీయ కక్షతో నిషేధిత జాబితాలో పెట్టారని, రెవెన్యూ అధికా రులకు మామూళ్లు ఇవ్వలేదని నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించినవారు లేకపోలేదు. ఒక్కసారి 22ఏ జాబితాలో చేరిస్తే దానిని తొలగించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా రూపొందిస్తున్న జాబితా సక్రమమేనా.. ఇబ్బందులుంటాయానన్నది త్వరలోనే తేలనుంది.
అసలేమిటీ 22ఏ జాబితా
కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చట్టం–1908లో సెక్షన్ 22ఏ అనే నిబంధన ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలు జరగకుండా అడ్డుకోవడం. ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలతో గెజిట్ ప్రకటన జారీ చేశాక ఆ భూములను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకూడదు. ప్రభుత్వమే డీ నోటిఫై చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. ఇందులో 5 రకాల నిబంధనలుండగా రైతులకు గుదిబండగా మారింది. అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలను నిషేధిస్తూ తెచ్చిన 1977 చట్టం ప్రకారం సెక్షన్ 4(1) కింద గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొన్న భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. అమ్మడం, కొనడం నిషేధం. షెడ్యూల్ ప్రాంతాల్లో భూ బదలాయింపు నియంత్రణ చట్టం 1959 ప్రకారం నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొన్న భూముల క్రయ విక్రయాలు జరగకుండా చూడాలి. నీటి వనరుల పరిధిలో ఉండే భూములు అంటే చెరువులు, కుంటలు, వాగులు, బావులు, జలాశయాలు, నాలాలు, నదులు వంటి వాటికి 10 మీటర్ల పరిధిలో ఉన్న భూములు క్రయవిక్రయాలు జరగకుండా నిషేధించారు. భూ సేకరణ చట్టం కింద సేకరించిన భూములు. గెజిట్‌లో నోటిఫై చేయని భూములు దీనికి వర్తించవు.


