బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌

Nov 17 2025 8:40 AM | Updated on Nov 17 2025 8:40 AM

బీసీ

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌

కరీంనగర్‌/కరీంనగర్‌టౌన్‌: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌ నుంచి కమాన్‌ చౌరస్తా వరకు ‘రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌’ కార్యక్రమంలో భాగంగా ‘మార్నింగ్‌ వాక్‌’ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేశారు. బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ 60శాతం పైగా ఉన్న బీసీ జనాభాకు న్యాయబద్ధంగా రా వాల్సిన హక్కు కోసం ధర్మయుద్ధం చేస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఫలితాలతో స్థానిక ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్‌ను బీసీలు నమ్మరన్నారు. ఇప్పటికై నా 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నాయకులు ఆది మల్లేశం పటేల్‌, నాగుల కనకయ్య గౌడ్‌, ఆశిశ్‌గౌడ్‌ పురుషోత్తం, జీఎస్‌ ఆనంద్‌, రంగు సంపత్‌గౌడ్‌, రాజకుమార్‌, ప్రశాంత్‌, తిరుపతి, నితిన్‌, బాబన్న, సురేందర్‌ పాల్గొన్నారు.

హిమోఫిలియాపై అవగాహన

కరీంనగర్‌: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, హిమోఫిలియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఐఎంఏ హాల్‌లో హిమోఫిలియాపై అవగాహన కల్పించారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ రక్తస్రావం జరిగినప్పుడు ఏవిధంగా అరికట్టాలనే అంశంపై హిమోఫిలియా ఉన్న పిల్లలతో సహా దాదా పు 70మంది రోగులకు అవగాహన కల్పించారు. సిటీ ఆసుపత్రి డాక్టర్‌ వెంకటరెడ్డి ఉచితంగా రక్తమార్పిడి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐఎంఏ బాధ్యులు ఆకుల శైలజ, మహేశ్‌బాబు, వర్షి, నవీన, సునీల్‌రాజ్‌, మానస, దామోదర్‌, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

ముగిసిన యోగా పోటీలు

రామడుగు: రామడుగు మండలం వెలిచాల జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి యోగా చాంపియన్‌ షిప్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవ నం సాగించాలంటే యోగా చేయాలన్నారు. పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్రజట్టుకు ఎంపిక చేశారు. మాజీ ఎంపీపీ వీర్ల నర్సింగరావు, నిర్వాహకులు దత్తాత్రి శర్మ, వీర్ల హన్మంతరావు, చాట్ల శ్రీధర్‌ పాల్గొన్నారు.

కబడ్డీ పోటీలకు స్పందన

కరీంనగర్‌స్పోర్ట్స్‌: జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన జూనియర్స్‌, సీని యర్స్‌ పురుషుల, మహిళల కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి 120 మంది పురుషులు, 90మంది మహిళలు హాజరయ్యారు. రాణించినవారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. బాలుర జూనియర్‌ రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్‌ 4 నుంచి 6వరకు మహబూబ్‌నగర్‌లో, జూనియర్‌ బాలికల పోటీలు డిసెంబర్‌ 2 నుంచి 4 వరకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌, సీనియర్స్‌ పురుషుల, మహిళల పోటీలు డిసెంబర్‌ 11 నుంచి 14 వరకు కరీంనగర్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సంపత్‌రావు తెలిపారు.

ముగిసిన చిల్డ్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌

కరీంనగర్‌కల్చరల్‌: బాలల దినోత్సవం సందర్భంగా ఫిలింభవన్‌లో భాషా సాంస్కృతికశా ఖ, కఫిసొ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి జరుగుతున్న చిల్డ్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆదివారంతో ముగిసింది. ఆదివారం రాజు ఔర్‌ టింకూ సినిమా ప్రదర్శించారు. కఫిసొ ఉపాధ్యక్షుడు సయ్యద్‌ ముజఫర్‌, ప్రధాన కార్యదర్శి, ఫెస్టివల్‌ కో ఆర్డినేటర్‌ కె.లక్ష్మీగౌతమ్‌ పాల్గొన్నారు.

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో   రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌
1
1/3

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో   రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌
2
2/3

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో   రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌
3
3/3

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement