అడవి.. అందాల విడిది!
● అర్బన్ పార్క్‌లో కొత్త అందాలు ● హరిదాస్‌నగర్ వద్ద సిరిసిల్ల అర్బన్ పార్క్ ● 200 ఎకరాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి
సిరిసిల్ల: పని ఒత్తిడి, మానసిక ఒత్తిడికి గురయ్యే సిరిసిల్ల పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు అర్బన్ పార్క్ సిద్ధమైంది. పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో పార్క్‌ను ఏర్పాటుచేశారు. సిరిసిల్ల, వేములాడ పట్టణవాసులు సహా చుట్టుపక్కల వారు పొద్దంతా అడవి అందాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్–హరిదాస్‌నగర్ అటవీ ప్రాంతంలో 200 ఎకరాల్లో అర్బన్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అడవిలోకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డునూ ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు ఉల్లాసంగా గడిపేందుకు పూల మొక్కలు, గార్డెన్, ఆట వస్తువులు, వన భోజనాలకు వసతులు కల్పిస్తున్నారు. ధ్యానమందిరం ఏర్పాటు చేశారు. కూర్చోని సేదతీరేందుకు కుర్చీలు, బెంచీలున్నాయి. అడవి అందాలను, ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు టవర్లు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం రూ.3 కోట్లతో వివిధ పనులు చేపట్టారు. పార్క్‌లో ఇప్పటికే ఉన్న వృక్షాలు, మొక్కలకు తోడుగా ఖాళీ ప్రదేశాల్లో ఔషధ మొక్కలను, నక్షత్ర వనాలు, రాశివనాలనుపెంచారు. హెర్బల్ గార్డెన్, అడ్వెంచర్ టెక్కింగ్‌కు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కల చరిత్రను రాయనున్నారు. అడవిలోని నీటినిల్వ చేసేందుకు ఊట కుంటను , కుంట మధ్యలోకి వెళ్లేందుకు వంతెన కట్టారు. ‘అర్బన్ పార్క్‌లోకి ఆదివారాల్లో ఎక్కువ సందర్శకులు వస్తున్నారు. మిగితా రోజుల్లో సగటున పది మంది వస్తున్నారు. ఒక్కరికి రూ.10 నామమాత్రపు రుసుముతో అర్బన్ పార్క్‌లోకి అనుమతిస్తున్నాం. స్కూల్ పిల్లలకు రాయితీ ఇస్తున్నాం’.అని డిప్యూటీ రేంజ్ అధికారి ఎన్.మోహన్‌లాల్ తెలిపారు.
పార్క్‌లో బుద్ధుడి విగ్రహం
హరిదాస్‌నగర్ అర్బన్ పార్క్ కుంటలో వంతెన
అడవి.. అందాల విడిది!
అడవి.. అందాల విడిది!
అడవి.. అందాల విడిది!
అడవి.. అందాల విడిది!
అడవి.. అందాల విడిది!


