తీరుమారని టీ– హబ్
కరీంనగర్: జిల్లా ఆస్పత్రిలోని రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం (టీ–హబ్) తీరు మారడం లేదు. టీ– హబ్‌లో సగం పరీక్షలు కూడా జరగక పో వడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజల్ట్ కూడా ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెషిన్లకు రిపేర్లు చేసేందుకు వచ్చిన ఇంజినీర్లు ఏం చేస్తున్నారనే సందేహం వ్యక్తమవుతోంది. రిపేర్ జరిగిన మరుసటి రోజే మళ్లీ పాత కథే పునరావృతం కావడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు సీబీపీ, ఏఈసీ, స్టూల్ ఫర్ అక్యూల్ట్‌బల్డ్, ట్రాప్–ఐ, ఎస్–టైపీ, చికున్‌గున్యా, లెప్టోస్పిరా, స్క్రబ్ టైపస్, స్టూల్ ఫర్ ఓవా అండ్ క్రిస్ట్, మలేరియా ర్యాపిడ్, ఈఎస్‌ఆర్, రెటిక్‌కౌంట్, సీరమ్ ఎలక్ట్రోలైట్స్, ఏబీజీ పరీక్షలు జరిగేవి. ప్రస్తుతం విటమిన్ డీ3, బీ12 పరీక్షలు అదనంగా జరుగుతున్నాయి.
రేపు విద్యుత్ వినియోగదారుల ఫోరం సదస్సు
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని 33/11 కె.వీ.సబ్‌స్టేషన్‌లో నేడు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ విని యోగదారుల ఫోరం సదస్సు నిర్వహిస్తున్నట్లు టీస్‌ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్ ఎన్వీ వేణుగోపాలచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, లో ఓల్టేజీ హెచ్చ తగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెంపుదల, లోపాలున్న మీటర్ల మార్పు, నూతన సర్వీసుల మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సర్వీసు పేరు మార్పు, సర్వీసు రద్దు తదితర సమస్యలపై నగరవాసులు ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
కవితా సంకలనం ఆవిష్కరణ
కరీంనగర్‌కల్చరల్: మనిషి ఇహలోకంలో సాధ్యం కాని విషయాలను ఊహాలోకంలో దర్శించి సంతృప్తి చెందుతాడని, నా ఊహలో అంశంపై కవులు తమ భావాలను అద్భుతంగా కవితలుగా చిత్రీకరించారని కవి, రచయిత విమర్శకుడు, భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ అన్నారు. శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ, శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక మంథని సంయుక్త ఆధ్వర్యంలో దూడపాక శ్రీధర్ సంపాదకత్వంలో వెలువడిన ‘నా ఊహలో కవితా’ సంకలనా న్ని ఆవిష్కరించారు. పొర్ల వేణుగోపాలరావు, తూము నర్సయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
స్పందించేవారే కవులు
కరీంనగర్‌కల్చరల్: సమాజంలో జరిగే సంఘటనలు, సామాజిక రుగ్మతలపై స్పందిస్తూ కవితాస్త్రాలు సంధించే వారే కవులని తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పల్లె వీరాస్వామి అన్నారు. ఫిలింభవన్‌లో భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కాళిదాసు రచించిన శుభకృత్ కవితా సంపుటిని ఆవిష్కరించారు. కవులు అనంతాచార్య, బొమ్మకంటి కిషన్, అన్నాడి గజేందర్‌రెడ్డి, దామరకుంట శంకరయ్య, నడిమెట్ల రామ య్య, గంగుల శ్రీకర్, యోగ సంపత్ కుమార్ ఆచార్య పాల్గొన్నారు.
నగరంలో నేడు పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ. వెంకటసాయి థియేటర్ ఫీడర్ పరిధిలోని లక్ష్మీనగర్, పద్మశాలి వీధి, రాఘవేంద్రనగర్ ప్రాంతాలతో పాటు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.శివనగర్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, ప్రగతినగర్, టెలిఫోన్ క్వార్టర్స్, శివనగర్, బతుకమ్మకాలనీ, మార్కెండేయనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
తీరుమారని టీ– హబ్


