గుంత.. చింత
కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. కొత్తపల్లి వద్ద ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి గుంతల రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అదుపుతప్పి ప్రమాదల బారిన పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద గుంతను తప్పించబోయిన టిప్పర్ బస్సుపై పడడంతో 19మంది మృతి చెందిన విషయాన్ని అయినా దృష్టిలో పెట్టుకుని రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గుంతలు పూడ్చివేయాలని వాహనదారులు, కొత్తపల్లి ప్రజలు కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


