బ్యాంకు అభివృద్ధికి సహకరించండి
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ కర్ర రాజశేఖర్ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కోరారు. మంగళవారం నూతన పాలకవర్గంతో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలకతీతంగా అర్బన్ బ్యాంకును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాలని కోరారు. డైరెక్టర్లు బొమ్మరాతి సాయికృష్ణ, దేశ వేదాద్రి, కన్న సాయి, బాశెట్టి కిషన్, బండి ప్రశాంత్‌దీపక్, తాడ వీరారెడ్డి, వరాల జ్యోతి, ముద్దసాని శ్వేత, సరిళ్ల రతన్‌రాజు పాల్గొన్నారు.


