
వేములవాడలో కొండచిలువ
వేములవాడ పట్టణ శివారులోని మూలవాగు తీరంలో ధోబీఘాట్ వద్ద 9 ఫీట్ల పొడవు ఉన్న కొండచిలువ సోమవారం కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రాఫిక్ ఎస్సై రాజు అక్కడికి చేరుకుని పాములు పట్టే జగదీశ్‌కు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి కొండచిలువను పట్టుకొని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. – వేములవాడ
కరీంనగర్‌కు ఒడిశా పోలీసులు
కరీంనగర్‌క్రైం: సైబర్ క్రైం కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలీసులు సోమవారం కరీంనగర్‌కు వచ్చినట్లు తెలిసింది. కరీంనగర్ టూటౌన్ పరిధికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి పాత్ర ఉందని భావించి అతను ఉంటున్న విద్యానగర్ ప్రాంతంలో దర్యాప్తు చేశారు. సైబర్ నేరస్తులు సామాన్యులకు కొంతడబ్బు ఇచ్చి వారి పేర్లపై ఖాతాలు తెరుస్తుండటంతో ఇలాంటి నేరంతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న పోలీసులు అతడిని అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం.