
ఆనందం.. ఆహ్లాదం.. ఆరోగ్యం..
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో సుదీర్ఘకాలం భాగస్వాములై ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోజూ సూర్యోదయానికి ముందే స్థానిక ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ మైదానానికి కాలినడకన చేరుకుంటున్నారు. వ్యాయామం, యోగా, ధ్యానం సాధన చేస్తూ, ఆసనాలు వేస్తున్నారు. మనశ్శాంతి, ఆహ్లాదం కోసం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సూర్యాస్తమయానికి ముందే మళ్లీ అందరూ మైదానం చేరుకుని సాధన చేస్తున్నారు.
రోజూ వ్యాయామం.. యోగా సాధన
సుఖదుఃఖాలు పంచుకుంటున్న వైనం
ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆదర్శం

ఆనందం.. ఆహ్లాదం.. ఆరోగ్యం..

ఆనందం.. ఆహ్లాదం.. ఆరోగ్యం..