
ఆర్టీసీకి దసరా ధమాకా
కరీంనగర్: టీజీ ఆర్టీసీకి బతుకమ్మ, దసరా పండుగలు కాసుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్ 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు పండక్కి ప్రత్యేక బస్సులు నడుపగా కరీంనగర్ రీజియన్‌కు 11రోజుల్లో 4,80,01,642 ఆదాయం సమకూరింది. కరీంనగర్–2 డిపో రూ.76,62,160తో మొదటిస్థానం, గోదావరిఖని డిపో రూ.73,78,376 ఆదాయంతో రెండోస్థానం, కరీంనగర్–1 డిపో రూ.48,24,323 ఆదాయంతో మూడోస్థానంలో ఉన్నాయి. హుస్నాబాద్ డిపో రూ.28,37,837 ఆదాయంతో చివరిస్థానంలో నిలిచింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్–1, కరీంనగర్–2, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, మంథని, గోదావరిఖని, కోరుట్ల, హుజూరాబాద్, మెట్‌పల్లి, హుస్నాబాద్ డిపోల నుంచి కరీంనగర్ మీదుగా హైదరాబాద్ జేబీఎస్, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపింది. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేయమని ముందుగానే ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి ఈనెల 5వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం, ఉపాధి అవసరాల కోసం దూర ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్లకు రావడం ఆర్టీసీకి కలిసొచ్చింది. కరీంనగర్ రీజియన్ అధికారులు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో మకాం వేసి బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు.
సమష్టి కృషితోనే
ఈసారి ప్రత్యేక సర్వీసులు నడిపినా సాధారణ రోజుల్లో మాదిరిగానే ప్రయాణాలు జరిగాయి. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులతో తిరిగి సంస్థకు అధిక ఆదాయం రావడం సంతోషించదగ్గ విషయం. 11 రోజుల్లో రెగ్యులర్‌గా రోజువారీగా వచ్చే ఆదాయం కాకుండా అదనంగా నడిపిన ప్రత్యేక బస్సులతో రూ.4.80 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకరావడానికి అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీలోనే ప్రయాణించాలి.
– రాజు, ఆర్టీసీ ఆర్‌ఎం
సెప్టెంబర్ 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు
రీజియన్ పరిధిలో వచ్చిన ఆదాయం
డిపో బస్సులు ఆదాయం మహాలక్ష్మి మొత్తం
(రూ.లక్షల్లో) ప్రయాణికులు ప్రయాణికులు
గోదావరిఖని 260 73,78,376 45,445 71,142
హుస్నాబాద్ 100 28,37,837 17,479 27,362
హుజూరాబాద్ 110 31,21,621 19,227 30,099
కరీంనగర్–1 170 48,24,323 29,714 46,516
కరీంనగర్–2 270 76,62,160 47,192 73,878
మంథని 120 35,87,338 20,974 33,288
జగిత్యాల 140 40,73,725 25,302 39,507
కోరుట్ల 120 34,05,404 20,974 32,835
మెట్‌పల్లి 140 39,72,972 24,470 38,307
సిరిసిల్ల 130 36,89,188 22,722 35,571
వేములవాడ 120 34,48,698 21,732 34,613
రీజియన్ మొత్తం 1,680 4,80,01,642 2,95,232 4,63,119
11 రోజుల్లో రూ.4.80 కోట్ల ఆదాయం

ఆర్టీసీకి దసరా ధమాకా