విద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 11డిపోల పరిధిలో నిర్వహించిన లక్కీడ్రాను బుధవారం కరీంనగర్ బస్‌స్టేషన్ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తీశారు. కరీంనగర్‌కు చెందిన ఈ.రమేశ్ మొదటి బహుమతి రూ.25వేలు, గోదావరిఖనికి చెందిన వి.సదానందం రెండో బహుమతిగా రూ.15వేలు, జగిత్యాలకు చెందిన కె.నాగరాజు మూడోబహుమతిగా రూ.10వేలు గెలుచుకున్నారు. కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్.భూపతిరెడ్డి, 1,2 డిపోల మేనేజర్లు ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్, బస్‌స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశం, అకౌంట్స్ ఆఫీసర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.