
ఆలయాల్లో దొంగతనం
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలం కనుకుల పెద్దమ్మతల్లి ఆలయంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు పడి పుస్తెలు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు ముదిరాజ్ కులస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ఆలయం తలుపులు తీసి చూసేసరికి అమ్మవారి మెడలోని బంగారు పుస్తెలు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిసిందన్నారు. ఎస్సై శ్రావణ్‌కుమార్ పరిశీలించి క్లూస్‌టీంతో వివరాలు సేకరించారు. ముదిరాజ్‌కుల సంఘం అధ్యక్షుడు కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్ శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో..
కాల్వశ్రీరాంపూర్: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దొంగలు ఆలయ హుండీని ఎత్తుకెళ్లి పోలీస్‌స్టేషన్ దారిలోని నీకంఠం చెరువు వద్ద పగులగొట్టారు. అందులోని కానుకలు, నగదు దోచుకున్నారు. సమీప ప్రజలు పోలీసులకు సమాచారం అందించగా ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.