
సోలార్ ప్లాంట్ నిర్మాణంలో వలస కార్మికుడి మృతి
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఆ వరణలో కొత్తగా నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్ ని ర్మాణ పని ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివదయా ల్ రావత్(23) మా అస్తభుజ కన్‌స్ట్రక్షన్‌లో హె ల్పర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువా రం ఉదయం విధులు నిర్వహిస్తున్న క్రమంలో అతడిపై ట్రాన్స్‌ఫార్మర్ పడింది. తీవ్రగాయాలైన అతడిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.
పని స్థలాల్లో రక్షణ చర్యలు కరువు
సోలార్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రక్షణ లేక ప్రమాదం జరిగి వలస కార్మికుడు మృతి చెందడం బాధాకరమని పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వెల్గటూర్(ధర్మపురి): విద్యుత్ షాక్‌తో కౌ లురైతు మృతిచెందిన ఘటన ఎండపల్లి మండలం మారేడ్‌పల్లిలో జరిగింది. పోలీసులు తె లిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బింగి సతీశ్ (35) భూమి కౌలుకు తీసుకొని వ్యవసా యం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గురువా రం ఉదయం తన తండ్రితో కలిసి పత్తి చేనుకు మందు కొట్టేందుకు వెళ్లాడు. నీళ్లు పోసేందుకు బిందె కోసమని తండ్రిని పక్క పొలానికి వెళ్లమని చెప్పాడు. ఈక్రమంలో అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు పక్క పొలానికి చెందిన కోట కనకయ్య పొలానికి విద్యుత్ తీగలు అమర్చాడు. ఉదయం పూట విద్యుత్ కనెక్షన్ తొలగించాల్సి ఉండగా అతడు పొలానికి రావడం ఆలస్యం అయింది. అప్పటికే పత్తి మందు కొట్టేందుకు వచ్చిన సతీశ్ విద్యుత్ తీగలు గమనించకుండా వాటిపై కాలు వేయడంతో షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఏడేళ్ల లోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బసంత్‌నగర్ ఎస్సై స్వామి తెలిపారు. కాగా ముంజంపల్లి, మారేడ్‌పల్లి గ్రామాల్లో విద్యుత్‌షాక్‌తో రెండునెలల్లో ముగ్గురు మృతిచెందారు. ముంజంపల్లికి చెందిన బొమ్మగాని తిరుపతి ట్రిమ్మర్ చార్జింగ్ పెడుతూ, మారేడ్‌పల్లికి చెందిన లింగాల చిన్నయ్య, బింగి సతీశ్ పొలం వద్ద మృతిచెందారు.
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో..
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌కు చెందిన దోమకొండ శ్రీకాంత్‌యాదవ్(26) అనే యువకుడు గల్ఫ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈమేరకు గురువారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శ్రీకాంత్ ఆరు నెలల క్రితం స్వగ్రామంలో ఉపాధి లేక దుబాయ్ వెళ్లాడు. ఈనెల 4వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి తండ్రి దేవయ్య, తల్లి చంద్రవ్వ ఉన్నారు. శ్రీకాంత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
హుజూరాబాద్‌రూరల్: మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ బుధవారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడగా గురువారం వేకువవజామున వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం. పెరుమాండ్ల రాజ్‌కుమార్(38) జార్ఖండ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దసరా పండక్కి ఇంటికి వచ్చి, నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో ఆయన భార్య, కూతురు పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. జవాన్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. తన చావుకు ఎవరూ కారణం కాదని, తనకు నిద్ర పట్టడం లేదని, అక్క, బావలు అమ్మనాన్నలను మంచిగా చూసుకోవాలని లేఖలో రాశాడు. మృతుడి తండ్రి బిక్షపతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి చెందిన పోతు అంజయ్య(76) అనే వృద్ధుడు అనారోగ్యం బాధ భరించలేక గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. అంజయ్య కొంతకాలంగా మూత్ర, మలవిసర్జన వ్యాధులతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించగా నయం కాలేదు. బీపీ, షుగర్ పెరగడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గతంలోనే అతని భార్య అనారోగ్యంతో చనిపోవడం, వృద్ధాప్యంలో తనకు సేవలు చేసే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. మృతునికి ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు ఆనందం గతంలో అనారోగ్యంతో మరణించాడు. మిగతా ఇద్దరు కుమారులు అమెరికాలో ఉంటున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.