
ఔట్‌సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్‌కు..
కరీంనగర్ అర్బన్: భూ భారతి ఆపరేటర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. దసరా కానుకగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లు ధరణి ఆపరేటర్లుగా వ్యవహరించిన వారంతా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహించారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని తహసీల్దా ర్ కార్యాలయాల్లో ఒక్కో ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. భూ క్రయ, విక్రయాల్లో స్లాట్ ప్రక్రి య అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వీరిదే కీలకపాత్ర. జిల్లాలో 16మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఉండగా గతంలో ధరణి ఆపరేటర్లుగా పిలిచేవారు. ఏజెన్సీ ద్వారా రూ.12వేల జీతభత్యాలు ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి వచ్చేవి. ఉద్యోగానికి భద్రత లేని దుస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలను పెంచడంతో పాటు ఏజెన్సీ పర్యవేక్షణ నుంచి తొలగించింది. ఔట్ సోర్సింగ్ కాకుండా టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించింది. వేతనాన్ని రూ.28వేలకు పెంచగా కటింగ్‌లు పోనూ రూ.19వేల వరకు వచ్చే అవకాశముంది. ఇక ధరణి ఆపరేటర్ కాకుండా భూ భారతి ఎఫ్‌టీఎస్‌గా పిలవనున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 16మందికి భరోసా లభించింది. ప్రభు త్వ నిర్ణయంతో సదరు ఉద్యోగులు భూభారతి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లం వెంకటరాజన్న నేతృత్వంలో ఆదివారం సంబరాలు నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్జతలు తెలిపారు. భూభారతి ఆపరేట ర్లు నరేశ్, వినయ్, విక్రమ్, ఆంజనేయులు, మౌని క, అజయ్, రాజశేఖర్, శ్వేత, వినయ్, శ్రీధర్, విక్ర మ్, కిరణ్, సాగర్, సత్యానందం, దేవేందర్, అనిల్‌కుమార్, రాము, జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు.