
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రం శివారు నిజామాబాద్ రోడ్‌లోని స్వప్న బార్‌లో హత్యకు పాల్పడ్డ నిందితుడు చరణ్‌సింగ్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడారు. ఈనెల 25 అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన వంగ శ్రీనివాస్‌ను హత్య చేసిన చరణ్‌సింగ్‌ను శుక్రవారం మధ్యాహ్నం హస్నాబాద్ గ్రామ శివారులోని ఇసుక డంప్ వద్ద పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సైలు రవికిరణ్, కుమారస్వామి పాల్గొన్నారు.