
ట్రినిటిలో బతుకమ్మ సంబరాలు
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌లో ట్రినిటి గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఆదివారం బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మమతారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు బతుకమ్మ పాటలు ఆడారు.
పండుగ పూట విషాదం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎంగిలి పూల బతుకమ్మ పండుగ పూట కోరుట్ల వాసి రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషాద ఘటన తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన గుండెటి శ్రీధర్(45) తన భార్యతో కలిసి 2 రోజుల క్రితం హైదరాబాద్‌కు బంధువులు ఇంటికెళ్లారు. ఆదివారం రాత్రి తమ వేగన్‌ఆర్ కారులో తిరుగు ప్రయాణంలో తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులోకి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న హెరియర్ కారు హైదరాబాద్ వెళ్తూ రాంగ్ రూట్లో వచ్చి వేగంగా ఢీకొట్టింది. దీంతో శ్రీధర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. హెరియర్ కారులో ఉన్న అంకుషాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రమాద స్థలం నుంచి పరారయ్యారు. క్షతగాత్రుడు శ్రీధర్‌ను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ట్రినిటిలో బతుకమ్మ సంబరాలు