
ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య
చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనకయ్య(46) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా పనిచేస్తున్న కనకయ్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి ఆరుబయట పురుగుల మందు తాగి పడిపోయాడు. స్థానికులు గమనించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
వేములవాడ: పట్టణంలోని భగవంతరావునగర్‌లో చల్లా లక్ష్మి(75) అనే వృద్ధురాలు సోమవారం బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆరేళ్ల క్రితం భర్త చనిపోవడంతో లక్ష్మి ఒంటరిగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. వృద్ధాప్యంతోపాటు ఒంటరిగా ఉంటున్న తాను మానసికస్థితి తట్టుకోలేక ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుంది. పెద్దకొడుకు గంగాధర్ తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు.
జగిత్యాలక్రైం: పట్టణంలోని కరీంనగర్‌రోడ్‌లో అట్ల శ్రీకాంత్‌ను బీరుసీసాతో పొడిచి హత్యకు ప్రయత్నించిన సందీప్, సమీర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంగడిబజార్‌కు చెందిన శ్రీకాంత్, గోవిందుపల్లికి చెందిన సందీప్ ఓ పంచాయితీ విషయంలో ఆదివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలోనే సందీప్‌తోపాటు సమీర్ ఆగ్రహంతో బీరుసీసా పగులగొట్టి శ్రీకాంత్‌పై దాడిచేసి పారిపోయారు. శ్రీకాంత్ సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు సందీప్‌తోపాటు సమీర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మెట్‌పల్లి: తనకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వాలని అడిగిన యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణానికి చె ందిన ఎనగందుల గణేశ్ కొంతకాలం క్రితం జగిత్యాలలోని మిర్యాల్‌కర్ రాజేశ్వర్ మటన్ దుకాణంలో పని చేశాడు. ఆ సమయంలో బకా యి ఉన్న రూ.5వేల గురించి ఆదివా రం అతడికి ఫోన్ చేసి అడిగాడు. దీనికి ఆగ్రహించిన రాజేశ్వర్.. దుర్భషలాడుతూ అంతు చూస్తానని బెది రించాడు. సాయంత్రం విష్ణు, నిఖిల్‌తో కలిసి మెట్‌పల్లిలోని గణేశ్ ఇంటికి వచ్చాడు. అతడు లేకపోవడంతో ఇంట్లో వాళ్లని తిట్టి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో బస్ డిపో చౌరస్తాలో గణేశ్ తన మిత్రులతో ఉండగా.. అక్కడకు వచ్చి ముగ్గురూ అతనితో గొడవకు దిగారు. రాజేశ్వర్ తన వెంట తెచ్చుకున్న కత్తి తో గణేశ్ కడుపులో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన గణేశ్‌ను మొదట స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. అక్కడినుంచి నిజామాబాద్ తరలించారు. గణేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.