
ముగిసిన బ్రహ్మోత్సవాలు
విశ్వకర్మ భగవాన్ ఉత్సవమూర్తుల శోభాయాత్ర
మహా పూర్ణాహుతిలో పాల్గొన్న భక్తులు
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని కమాన్‌చౌరస్తాలో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం స్థాపిత దేవతారాధనలు, శ్రీగాయత్రీ విశ్వకర్మ సహస్ర నామార్చనలు, పూర్ణాహుతి, మహానివేదన, మంగళహారతి, మహామంత్ర పుష్పం అనంతరం తీర్థప్రసాద వితరణ గావించారు. భక్తులకు అన్నదానం చేశారు. విశ్వకర్మ భగవానుని ఉత్సవమూర్తుల శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈవో ఉడుతల వెంకన్న, చైర్మన్ ముత్తోజు రామ్‌కుమార్, ధర్మకర్తలు వెగ్గళం రామకృష్ణ, ఎదులాపురం అన్నయ్య, గోగులకొండ నరసింహాచారి, వంగల నవీన్, గోకులకొండ కరుణాకర్, రాగటి కవిత పాల్గొన్నారు.
వైభవంగా సాగిన విశ్వకర్మ భగవానుడి శోభాయాత్ర

ముగిసిన బ్రహ్మోత్సవాలు