
‘పటేల్ నిర్ణయంతోనే తెలంగాణకు విమోచనం’
కరీంనగర్‌టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ సా హసోపేత నిర్ణయంతోనే తెలంగాణకు రజాకర్ల నుంచి విమోచనం లభించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కా ర్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 చరిత్రలో మర్చిపోలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బాస సత్యనారాయణ రావు, యాదగిరి సునీల్‌రావు, డి.శంకర్, గుగ్గిల్లపు రమేశ్, మేకల ప్రభాకర్ యాదవ్, ఇ.నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్: నిజాం నవాబుల పరిపాలన అంతం కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుఽ ద పోరాటాన్ని మతోన్మాదులు హిందూ, ముస్లింల పోరాటంగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరిస్తున్నారని, సాయుధ పోరాట వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బావండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, బీర్ల పద్మ పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: గ్రామ పాలన అధికారులు(జీపీవో) విధుల్లో చేరారు. గత అయిదేళ్లుగా గ్రామస్థాయిలో రెవెన్యూ పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడే సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వం జీపీవోలకు నియామక పత్రాలు అందించగా ఆయాశాఖలు రిలీవింగ్ అర్డర్ ఇవ్వడంలో జాప్యం చేశాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో ఈ నెల 12న ‘రిలీవింగ్ అర్డర్ కోసం నిరీక్షణ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కలెక్టర్ పమేలా సత్పతి ఆయాశాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణమే రిలీవ్ ఆదేశించారని సమాచారం. అత్యధికంగా మున్సిపల్, మిషన్ భగీరథ విభాగాల్లో విధులు నిర్వహిస్తుండగా రిలీవై మంగళవారం నుంచి వారికి కేటాయించిన స్థానాల్లో జీపీవోలుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 318 గ్రామ పంచాయతీలుండగా రెవెన్యూ క్లస్టర్లు 255 కాగా 187 మంది జీపీవోలుగా బాధ్యతలు స్వీకరించారు.
కరీంనగర్ అర్బన్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో ల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివా స్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ భవన్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. పీఆర్సీ, బకాయిలు, హెల్త్‌కార్డు, పెన్షనర్ల సమస్యలను వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్‌గౌడ్, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
సప్తగిరికాలనీ(కరీంనగర్): స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ రెండో విడత స్పాట్ అడ్మిషన్లు ఈనెల 18,19 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ తెలిపారు. విద్యార్థులు నేరుగా స్పాట్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నా రు. అన్ని అర్హత పత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. బీఎస్సీ లైఫ్‌సైన్స్‌లో 19, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్‌లో 23, బీకాం రిటైల్ ఆపరేషన్స్‌లో 8, బీకాం ఫైనాన్స్‌లో 3, బీకాం బిజినెస్ ఎనాల్టిక్స్‌లో 2, బీబీఏ, బీఏ ఇంగ్లిష్ మీడియంలో ఒక్కోసీటు మొత్తం 57 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇది చివరి అవకాశమని సూచించారు.

‘పటేల్ నిర్ణయంతోనే తెలంగాణకు విమోచనం’

‘పటేల్ నిర్ణయంతోనే తెలంగాణకు విమోచనం’