
ఇండ్లు పోతే ఆధారమే లేదు
● సుందరగిరిలో రోడ్డు విస్తరణపై గ్రామసభ ● బైపాస్ చేపట్టాలని గ్రామస్తుల వినతి
చిగురుమామిడి: మండలంలోని సుందరగిరిలో ఫో ర్‌లైన్ విస్తరణపై బుధవారం గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్ రమేశ్ అధ్యక్షతన స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రహదారి కి ఇరువైపులా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గ్రామసభ నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోతే తమకు ఆధారం లేదని వంతడ్పుల దిలీప్‌కుమార్, మొలు గూరి శ్రావణ్, కక్కెర్ల వెంకటేశ్, తాళ్లపల్లి చిన చంద్రయ్య, కెమసారం వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశా రు. ముందుగా నిర్ణయించిన ప్రకారం బైపాస్ నిర్మి స్తే బాగుంటుందని సూచించారు. నిర్వాసితుల ఆందోళనతో రసాభాసగా మారిన గ్రామసభ మధ్యలోనే వాయిదా పడింది. నిర్వాసితుల విన్నపాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.