
అరటి సాగు చేయండి
జగిత్యాలఅగ్రికల్చర్: వరి, మొక్కజొన్న పంటలకు భిన్నంగా అరటి సాగు చేసి ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యామ్‌ప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో అరటిసాగుపై గురువారం అవగాహన కల్పించారు. అరటి సాగుతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఎకరాకు రూ.28వేల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1500 ఎకరాల నుంచి 25 ఎకరాలకు సాగు పడిపోయిందని నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి స్వాతి అన్నారు. అభ్యుదయ రైతు జితేందర్‌రావు మాట్లాడుతూ ఢిల్లీ, హైదరాబాద్ అరటి వ్యాపారులు బైబ్యాక్ పద్ధతిలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హెచ్‌ఈవో అనిల్, ఆయిల్ పాం ప్రతినిధి విజయ్‌భరత్, డ్రిప్ కంపెనీ ప్రతినిధి దేవేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసిన మహిళపై కేసు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని ఓ బ్యూటీ సంస్థకు చెందిన ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసిన మహిళపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యూటీ సంస్థ ప్రతినిధి శైలజ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణవేణి అనే మహిళపై కేసు నమోదు చేశారు.