
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జమ్మికుంట: బంధువు అంత్యక్రియలకు వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన జమ్మికుంట మండలం మడిపల్లి పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన కొలుగూరి మధునమ్మ,బాలయ్య దంపతుల కొడుకు నవీన్(23) మండలంలోని మడిపల్లి గ్రామంలో గురువారం బంధువు మృతి చెందగా అంత్యక్రియలకు హాజరయ్యాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో జమ్మికుంట వైపుకు బైక్‌పై వస్తుండగా.. మడిపల్లి శివారు శాంతినగర్‌లో ఎదురుగా వస్తున్న టాటాఏస్ ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.