
వరదకాలువలో కొట్టుకొచ్చిన మహిళ శవం
● మోర్తాడ్ మండలానికి చెందిన వృద్ధురాలిగా గుర్తింపు
మల్యాల: మండలంలోని నూకపల్లి శివారు వరదకాలువలో ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. ఆ శవాన్ని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రభావతిగా మల్యాల పోలీసులు గుర్తించారు. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. కామణి ప్రభావతి (66) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈనెల 16న ఇంట్లో నుండి వెళ్లిపోయింది. బంధువులు మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడు శ్రీనివాస్ వెతుకుతున్నాడు. వరదకాలువలో శవమై కొట్టుకురావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. శ్రీనివాస్‌ను పిలిపించగా.. తన తల్లిగా గుర్తించాడు. కేసు నమోదు చేసినట్లు మల్యాల పోలీసులు తెలిపారు.
వృద్ధురాలి మెడలోంచి బంగారం చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లికి చెందిన నేరెల్ల లచ్చవ్వ మెడలోంచి గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని దొంగ తులంన్నర బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లాడు. లచ్చవ్వ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆమెను మాటల్లో దింపి బంగారు కుత్తికట్టును లాక్కుని పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి దొంగ పారిపోయాడు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలోని సీసీ పుటేజీలు, ప్రధాన రహదారుల్లోని సీసీ పుటేజీని పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. గ్రామాల్లో అనుమానితులు కన్పిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సుధాకర్ అన్నారు.
రాజన్న హుండీ ఆదాయం రూ.1.21 కోట్లు
వేములవాడ: రాజన్నను దర్శించుకున్న భక్తులు హుండీలలో వేసిన కట్న, కానుకలను ఆలయ అధికారులు గురువారం ఓపెన్‌స్లాబ్‌లో లెక్కించారు. ఈ లెక్కింపును ఈవో రమాదేవి పర్యవేక్షించారు. రూ.1,21,70,150 నగదు, బంగారం 64 గ్రాములు, వెండి 7.300 కిలోలు వచ్చినట్లు ఈవో తెలిపారు. ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ అధికారులు, శ్రీశివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.93వేలకు టోకరా
కరీంనగర్ క్రైం: నగరానికి చెందిన వ్యక్తికి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.93వేలకు పైగా టోకరా వేశారు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని మారుతినగర్‌కు చెందిన శ్రీరామోజు రఘు టెలిగ్రాం యాప్‌లో ట్రేడింగ్‌కు సంబంధించిన ఓ లింకును క్లిక్ చేశాడు. క్యూఆర్ కోడ్ ద్వారా మొదట రూ.20వేలు పంపాలని, అధిక మొ త్తంలో తిరిగి చెల్లిస్తామని వాట్సప్‌లో సందే శం పంపడంతో డబ్బులు పంపించాడు. తరువాత పలు దఫాలుగా రూ.93వేలు వసూలు చేశారు. తర్వాత స్పందన లేకపోవడంతో పో లీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చే స్తున్నామని త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి తెలిపారు.
ఏపీ సైబర్ క్రైం పోలీసుల అదుపులో మల్యాల యువకులు
మల్యాల: మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులను ఓ సైబర్‌క్రైం కేసులో ఏపీ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో జరిగిన ఓ సైబర్‌క్రైం కేసులో మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నారని, తమ స్నేహితుడికి బ్యాంకు ఖాతా ఇవ్వడంతో వారి ఖాతాల్లో రూ.2లక్షలు జమ అయ్యాయని, ఆ మొత్తాన్ని డ్రా చేసి ఇచ్చారన్న సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని జగిత్యాలలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

వరదకాలువలో కొట్టుకొచ్చిన మహిళ శవం