
నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు
హుజూరాబాద్: ‘నా పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదు..’ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు పెడుతున్నారన్నారు. మీడియాను మేనేజ్ చేసి ఓర్‌లాపింగ్ టెక్నిక్‌తో నెట్టుకొస్తున్నారన్నారు. రూ.9వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థుల చదువులు బలిపీఠంపై ఎక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో సమయానికి డైట్ చార్జీలు చెల్లించక వారు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. సంవత్సరానికి దాదాపు రూ.3వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఖర్చు అవుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తుందన్నారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లలో డైట్ చార్జీలు ఆరు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు రూ.5లక్షల కార్డు ఇస్తామన్నా హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, నాయకులు గౌతంరెడ్డి, బండి కళాధర్, వెంకట్‌రెడ్డి, సంపత్‌రావు, సురేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కరుణాకర్, సురేందర్‌రాజు, సుదర్శన్‌రెడ్డి, శ్రీరామ్ శ్యామ్, తిరుపతి, కరుణాకర్, రత్నాకర్, సుమన్ పాల్గొన్నారు.
మాటలకు, చేతలకు పొంతన లేదు
యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్